Viral Video: ఇలాంటి శాడిస్టును ఏం చేయాలో చెప్పండి.. యువతి వెనుక స్కర్టుకు నిప్పంటించడంతో..
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:53 PM
ఓ యువతి రోడ్డు పక్కన దుకాణం ముందు నిలబడి ఉంటుంది. ఆమె వెనుకే ఓ వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి యువతికి తెలికుండా ఆమె స్కర్టుకు నిప్పంటించాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ఒంటరిగా ఉన్న మహిళలను చూస్తే కొందరు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. తాకరాని చోట తాకుతూ శునకానందం పొందేవారు కొందరైతే.. మరికొందరు వారి ఎదురుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందుతుంటారు. ఇంకొదరైతే వారిపై దాడులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి నిలబడి ఉండగా.. ఓ వ్యక్తి ఆమెను స్కర్టుకు నిప్పంటించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి రోడ్డు పక్కన దుకాణం ముందు నిలబడి ఉంటుంది. ఆమె వెనుకే ఓ వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
అప్పటిదాకా సైలెంట్‌గా కూర్చున్న ఆ వ్యక్తి.. ఉన్నట్టుండి తన జేబులోని లైటర్ బయటికి తీసి, (man who set fire to young woman's skirt) యువతి వెనుక స్కర్టుకు నిప్పంటించాడు. దీన్ని గమనించని ఆమె కాసేపటి తర్వాత అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తుంది. అయితే తన వెనుక డ్రస్ కాలిపోతున్న విషయాన్ని గమనించి ఒక్కసారిగా షాక్ అవుతంుది. మంటను ఆర్పాలని చూసినా ఆమె వల్ల కాదు. దీంతో చివరకు పరుగెత్తుకుంటూ తిరిగి దుకాణంలోకి వస్తుంది. చివరకు అక్కడున్న ఓ వ్యక్తి మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పిపోయింది.
Viral Video: ఇది కదా లైవ్ మ్యూజిక్ అంటే.. ఈ గిటారిస్ట్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
అంత జరుగుతన్నా ఆ వ్యక్తి మాత్రం.. తనకేమీ తెలియనట్లుగా అక్కడే కూర్చుండిపోయాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి శాడిస్టులను బహరింగంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: చూసేందుకు పిచ్చివాడైనా.. చేసిన పని చూస్తే.. శభాష్ అనాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..