Share News

Rahul Gandhi: బీజేపీ తీరుతో దేశానికి వినాశనమే

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:40 AM

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీల వెన్నెముక లేని రాజకీయాలతో మన దేశానికి వినాశనమేనని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

Rahul Gandhi: బీజేపీ తీరుతో దేశానికి వినాశనమే

  • భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినా పట్టించుకోవడం లేదు: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీల వెన్నెముక లేని రాజకీయాలతో మన దేశానికి వినాశనమేనని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. నాలుగు వేల కిలోమీటర్ల భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించినా పట్టించుకోవడం లేదని, ఇప్పుడు మిత్రదేశం అంటూనే అమెరికా 27ు ప్రతీకార (రెసిప్రోకల్‌) టారి్‌ఫలు విధించిందని.. వీటిపై మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు.


గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. చైనాతో 75 ఏళ్ల దౌత్య సంబంధాలను పురస్కరించుకుని వేడుకలు జరపడాన్ని తప్పుపట్టారు. కాగా రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ దీటుగా స్పందించింది. ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు మన దేశాన్ని పాలిస్తున్నది ఎవరని బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ నిలదీశారు. చైనా అధికారుల నుంచి రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు విరాళాలు అందుకున్నారా లేదా చెప్పాలని డిమాండ్‌ చేశారు. మన దేశానికి చెందిన అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 04:40 AM