Share News

దిగజారుతున్న ధరలతో వైట్‌బర్లీ రైతుల దిగాలు

ABN , Publish Date - Apr 06 , 2025 | 10:38 PM

ఓ పక్క దిగజారుతున్న ధరలు.. మరోపక్క ప్రకృతి వైపరీత్యాతాలు వైట్‌బర్లీ రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. పంట చేతికి అందివస్తున్న తరుణంలో వర్షపు హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. చేతికి అందివచ్చిన పంటను అమ్ముకుందామన్నా ధరలేకపోవడంతో ఏమిచేయాలో పాలుపోని స్థితిలో రైతులు ఉన్నారు. మార్కెట్‌లో ఉన్న ధరకు అమ్ముకుంటే కనీసం పెట్టుబడుల్లో కూడా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిగజారుతున్న ధరలతో వైట్‌బర్లీ రైతుల దిగాలు
వర్ష సూచనలతో వైట్‌బర్లీ పొగాకును మండెలుగా వేస్తున్న రైతులు

వర్ష సూచనపై ఆందోళన

పర్చూరు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) 6 : ఓ పక్క దిగజారుతున్న ధరలు.. మరోపక్క ప్రకృతి వైపరీత్యాతాలు వైట్‌బర్లీ రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. పంట చేతికి అందివస్తున్న తరుణంలో వర్షపు హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. చేతికి అందివచ్చిన పంటను అమ్ముకుందామన్నా ధరలేకపోవడంతో ఏమిచేయాలో పాలుపోని స్థితిలో రైతులు ఉన్నారు. మార్కెట్‌లో ఉన్న ధరకు అమ్ముకుంటే కనీసం పెట్టుబడుల్లో కూడా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఈ సమయానికి లోగ్రేడ్‌ పొగాకు క్వింటా రూ.14వేల ఉండగా, నాణ్యమైన పొగాకు క్వింటా రూ.18వేలు పైనే పలికింది. ప్రస్తు తం ఇదే పొగాకు క్వింటా రూ.2వేల నుం చి రూ.3వేలకు దిగజారిందని రైతులు విలపిస్తున్నారు. నాణ్యమైన పొగాకు సైతం క్వింటా రూ.8వేలకు మించి లేదని చెప్తున్నారు. పెట్టుబడులు, కూలి ఖర్చుల కోసం అమ్ముకోవల్సి వస్తోందన్నారు. రెం డ్రోజులుగా వానలు కురుస్తాయన్న అధికారుల ప్రకటన కలవరానికి గురిచేస్తోందని రైతులు చెప్తున్నారు. పొలాల్లో ఆరబెట్టి ఉండడంతో దాన్ని కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. వాన కురిస్తే తప పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. పర్చూరు వ్యవసాయ సబ్‌ వివిజన్‌ పరిధిలోని పర్చూ రు, కారంచేడు, యద్దనపూడి, ఇంకొల్లు మండలాల్లో 40వేల ఎకరాలకు పైగా రైతులు వైట్‌బర్లీ పొగాకును సాగు చేశారు. వ్యవసాయ ఖర్చులు, కౌలు కలుపుకుని ఎకరానికి రూ.1.5లక్షల వరకు ఖర్చు చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుత ధరను చూస్తుంటే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. కూ లీలు దొరక్క వేల ఎకరాల్లో బర్లీ పొలాల్లోనే ఎండిపోయే పరిస్థితి నెలకుంది.

Updated Date - Apr 06 , 2025 | 10:38 PM