Share News

Seema Haider: వామ్మో.. సీమా హైదర్ ఇంత సంపాదిస్తోందా..!

ABN , Publish Date - Feb 17 , 2025 | 02:31 PM

Seema Haider Earnings: సీమా హైదర్.. గుర్తుందా ఈ పేరు.. ఎవరామె అనుకుంటున్నారా.. అదేనండీ.. ఇండియాకు చెందిన వ్యక్తి సచిన్ మీనాని ప్రేమించి.. ఏకంగా పాకిస్తాన్ నుంచే పారిపోయి వచ్చింది. కట్టుకున్న భర్తను వదిలేసి మరీ ఇండియాకు వచ్చి తన ప్రియుడిని..

Seema Haider: వామ్మో.. సీమా హైదర్ ఇంత సంపాదిస్తోందా..!
Seema Haider - Sachin Meena

Seema Haider - Sachin Meena: సీమా హైదర్.. గుర్తుందా ఈ పేరు.. ఎవరామె అనుకుంటున్నారా.. అదేనండీ.. ఇండియాకు చెందిన వ్యక్తి సచిన్ మీనాని ప్రేమించి.. ఏకంగా పాకిస్తాన్ నుంచే పారిపోయి వచ్చింది. కట్టుకున్న భర్తను వదిలేసి మరీ ఇండియాకు వచ్చి తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఆమే.. సీమా హైదర్. ఇప్పుడు గుర్తొచ్చే ఉంటది లేండి. ఆ ప్రేమ పెళ్లితో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ జంట పాపులారిటీ ఇప్పటికీ తగ్గలేదు. అవును.. ఇందుకు నిదర్శనమే వారి సంపాదనగా చెప్పుకోవచ్చు. సీమా, సచిన్ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు.. తమ కాపురం బాగుండటానికి, జీవితంలో పైకి ఎదగడానికి అద్భుతమైన సంపాదన మార్గాన్ని ఎంచుకున్నారు. తద్వారా వీరిద్దరూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారట. మరి వీరిద్దరూ ఎలా సంపాదిస్తున్నారు.. లక్షల రూపాయల డబ్బులు వీరికి ఎలా వస్తున్నాయి.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రియుడి కోసం పాకిస్తాన్ నుంచి అక్రమంగా భారత్‌కి అక్రమంగా వచ్చిన సీమా హైదర్ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను పెళ్లి చేసుకున్న సీమా.. ఇప్పుడు మరోసారి ప్రధాన వార్తల్లో నిలిచింది. సీమా, సచిన్ ఇద్దరూ కలిసి భారీగా సంపాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 6 యూట్యూబ్ ఛానళ్లను క్రియేట్ చేశారట. వీటిలో విభిన్నమైన కంటెంట్ అందిస్తూ.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారట.


సీమా హైదర్ ఆదాయం..

తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సీమా.. తనకు యూట్యూబ్ నుంచి తొలి సంపాదనగా రూ. 45,000 వచ్చినట్లు చెప్పింది. అప్పటి నుంచి ఆ మొత్తం అమౌంట్ పెరుగుతూ వస్తుందట. ఇప్పుడు ప్రతి నెలా రూ. 80 వేల నుంచి రూ. 1 లక్షకు పైగా ఆదాయం వస్తుందని సీమా చెబుతోంది. ఈ మొత్తాన్ని యూట్యూబ్ వ్యూస్, లైవ్ స్ట్రీమింగ్ సమయంలో డొనేషన్లు, స్పాన్సర్ చేసిన వీడియోలు, బ్రాండ్ ప్రమోషన్ ద్వారా సంపాదిస్తున్నట్లు సీమా వెల్లడించింది.


ఆరు యూట్యూబ్ చానళ్లు..

సీమా, సచిన్ జంట ప్రస్తుతం మొత్తం ఆరు యూట్యూబ్ చానళ్లను క్రియేట్ చేసి నడుపుతున్నారు. వీటిల్లో తమ జీవన విధానం, తమ కుటుంబ జీవితం గురించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ ఛానెళ్లకు మొత్తం 17 లక్షలకు పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. వారి వీడియోలకు సగటున 25 వేల వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా భారీగా డబ్బులు వస్తుండటంతో సచిన్.. తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. పూర్తిగా యూట్యూబ్‌పైనే ఫోకస్ పెట్టాడు. మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు సచిన్, సీమా దంపతులు.


ప‌బ్ జీ కలిపిన జంట..

పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌, ఇండియాలోని యూపీకి చెందిన సచిన్ మీనాను ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ పబ్‌ జీ కలిపింది. పబ్ జీ ఆడుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలోనే సీమా హైదర్.. తన భర్తను వదిలేసి పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చింది. ఇక్కడ సచిన్‌ను కలిసి అతన్ని పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల క్రితం తమ ప్రేమకు గుర్తుగా మొదటి బిడ్డ పుట్టబోతున్నాడంటూ సీమా ఒక వీడియో కూడా విడుదల చేసింది.


Also Read:

చాంపియన్స్ ట్రోఫీ లైవ్ స్ట్రీమింగ్ అందులోనే..

ప్రధాని మోదీ, భర్త అంబానీపై ప్రశ్న.. నీతా మాస్‌ రిప్లై..

సెల్ఫీ వీడియో కలకలం

For More National News and Telugu News..

Updated Date - Feb 17 , 2025 | 02:31 PM