GATE 2025: గేట్‌లో కందుకూరు వాసి గ్రేట్
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:26 AM
దేశంలోని ఐఐటీలు, పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.

సాదినేని నిఖిల్‌కు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్
గేట్-2025లో మెరిసిన తెలుగు విద్యార్థులు
జాతీయ స్థాయిలో 1, 25, 28వ ర్యాంకులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
దేశంలోని ఐఐటీలు, పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన సాదినేని అఖిల్ చౌదరి (డేటా సైన్స్ విభాగం) ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల సీఎ్‌సఈ విభాగం ప్రొఫెసర్ సాధినేని శ్రీనివాసులు కుమారుడైన నిఖిల్ ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై ఆసక్తితో మద్రాస్ ఐఐటీ దూరవిద్య ద్వారా ఆ కోర్సు పూర్తి చేశారు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే ఏఐలో ఎంటెక్ చేయాలన్న లక్ష్యంతో ఆరు నెలలు గేట్ శిక్షణ తీసుకున్నారు. బుధవారం వెల్లడైన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో మెరిశారు. వైద్య రంగంలో ఏఐ ప్రభావంపై పరిశోధనలు చేయడమే తన లక్ష్యమని నిఖిల్ పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వంజంగికి చెందిన పైడి పూజిత 25వ ర్యాంకు సాధించారు. ఆమె నాగపూర్‌లోని వీఎన్‌ఐటీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. సొంతబొమ్మాళికి చెందిన కొన్న వినోద్‌కుమార్ జాతీయస్థాయిలో 28వ ర్యాంకు సాధించారు. వినోద్ ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. అలాగే శ్రీకాకుళానికి చెందిన అనంతపట్నాయకుని మాన్య ఆలిండియా 197వ ర్యాంకు, సోంపేటకు చెందిన బల్ల సాయితనూజ 396వ ర్యాంకు సాధించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చెరుకుమిల్లి విద్యార్థి సుధీర్ వర్మ కంప్యూటర్ సైన్స్‌లో 56వ ర్యాంకు సాధించాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడికి చెందిన కందా చెల్లారావు ఆలిండియాలో 111వ ర్యాంకు సాధించాడు. ఇక, గేట్ -2025 ఫలితాలను ఠీఠీఠీ.జీజ్టీట.్చఛి.జీుఽ లేదా జ్చ్ట్ఛ2025.జీజ్టీట.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ నెల 28 నుంచి మే 31వ తేదీ వరకు స్కోర్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.