Share News

SRH IPL 2025 Tickets: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ మ్యాచులు.. టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే..

ABN , Publish Date - Mar 21 , 2025 | 02:15 PM

SRH IPL Tickets Online Booking: ఐపీఎల్ మహా సంగ్రామానికి అంతా రెడీ అయిపోయింది. మరికొన్ని గంటల్లో క్యాష్ రిచ్ లీగ్ పోరాటానికి తెరలేవనుంది. మెగా కప్పు కోసం ప్లేయర్లు బరిలోకి దిగి కొదమసింహాల్లా పోటీపడనున్నారు.

SRH IPL 2025 Tickets: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ మ్యాచులు.. టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే..
Hyderabad IPL Match Tickets

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ వచ్చేసింది. మార్చి 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌లో ఉత్కంఠ పోరాటాలకు తెరలేవనుంది. దీంతో క్రికెట్ లవర్స్ ఆసక్తి మొత్తం అటు వైపు మళ్లుతోంది. తమ ఫేవరెట్ టీమ్స్ మ్యాచులు చూసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఈసారి సన్‌రైజర్స్ అభిమానులు తెగ ఎంజాయ్ చేయనున్నారు. దీనికి కారణం ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులతో పాటు ఓ క్వాలిఫయర్, ఒక ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచులకు సంబంధించిన టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి.. ఎక్కడ బుక్ చేసుకోవాలి.. టికెట్ల ధరలు ఎలా ఉన్నాయి లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..


ఆన్‌లైన్ టికెట్ బుకింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ హోమ్ మ్యాచుల టికెట్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అందుబాటులో ఉంటాయి. జొమాటోకి చెందిన డిస్ట్రిక్ట్ యాప్ లేదా వెబ్‌సైట్ (District.in)లో టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ టికెట్ల కోసం ఎస్‌ఆర్‌హెచ్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లినా తిరిగి డిస్ట్రిక్ట్.ఇన్ సైట్‌కే లింక్ రీడైరెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఈ సీజన్‌లోని తొలి రెండు మ్యాచులకు సంబంధించిన టికెట్లను మార్చి 7న అందుబాటులో ఉంచగా.. హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి.


ఆఫ్‌లైన్ టికెట్ బుకింగ్

సాధారణంగా ప్రతి ఐపీఎల్ మ్యాచులకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ విక్రయిస్తారు. స్టేడియం బాక్సాఫీస్, ఎంపిక చేసిన రిటైల్ ఔట్‌లెట్స్‌లో టికెట్లు అందుబాటులో ఉంచుతారు. సన్‌రైజర్స్ మ్యాచుల టికెట్లు జింఖానా, పరేడ్ గ్రౌండ్స్‌లో అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి టికెట్ల విక్రయాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం లేదు.


ధరలు

టికెట్ల ధరలు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ సమానంగా ఉంటాయి. మ్యాచ్ ఇంపార్టెన్స్‌తో పాటు సీటింగ్ కేటగిరీని బట్టి ధరలు మారుతుంటాయి. ఈ సీజన్ కోసం టికెట్ రేట్స్ రూ.750 నుంచి మొదలై రూ.30 వేల వరకు (ప్రీమియం సీట్స్) ఉన్నాయి. డిస్ట్రిక్ట్.ఇన్‌తో పాటు బుక్‌మై షో, పేటీఎం ఇన్‌సైడర్‌లో కూడా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. అయితే నకిలీ టికెట్ల బారి నుంచి తప్పించుకోవడానికి అధికారిక ప్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే వాడాలి. టికెట్ల అందుబాటు, ధరల కోసం ఎస్‌ఆర్‌హెచ్ వెబ్‌సైట్, సోషల్ మీడియాను ఫాలో అయితే సరిపోతుంది. బుకింగ్ చేసే టైమ్‌లో మ్యాచ్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత సీటింగ్ కేటగిరీని సెలెక్ట్ చేసి పేమెంట్ చేయాలి. ట్రాన్సాక్షన్ పూర్తయితే ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీకి డిజిటల్ టికెట్ పంపిస్తారు.


ఇవీ చదవండి:

హార్దిక్‌ను బకరా చేసిన బీసీసీఐ

ఐపీఎల్ 2025 ఫుల్ షెడ్యూల్ ఇదే..

మొదటి రోజే IPL ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2025 | 02:20 PM

News Hub