Uniform Civil Code: లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో పుట్టిన పిల్లలకు ఆ హక్కు: సీఎం సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 27 , 2025 | 07:22 PM
Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌ను నేటి నుంచి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అమలు చేస్తోంది. అందులోభాగంగా సీఎం దామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

డెహ్రాడూన్, జనవరి 27: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ను సోమవారం నుంచి అమలు చేస్తున్నామని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ దామి వెల్లడించారు. దేశంలోనే యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సోమవారం డెహ్రాడూన్‌లో సీఎం పుష్కర్ సింగ్ ధామి విలేకర్ల సమావేశంలో యూనిఫాం సివిల్ కోడ్ నిబంధనలను విశదీకరించారు. రాష్ట్రంలో అన్ని మతాలలో బహుభార్యత్వం నిషేధించబడిందన్నారు.
అలాగే తల్లిదండ్రుల ఆస్తుల్లో కుమార్తెలకు సైతం సమాన హక్కులు కల్పించ బడ్డతాయని చెప్పారు. రెండో వివాహం, లివ్ ఇన్ రిలేషన్ షిప్ వల్ల జన్మించిన ఆడ పిల్లలకు సైతం ఆస్తిలో సమాన వాటా ఉంటుందని పేర్కొన్నారు. అయితే లివ్ ఇన్ రిలేషన్ షిప్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ విషయాన్ని.. వారి తల్లిదండ్రులకు రిజిస్ట్రార్ సమాచారం అందిస్తారన్నారు.
అందుకు సంబంధించిన సమాచారం మాత్రం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు. అన్ని మాతాల్లో ఆడపిల్లలకు సమాన వాటా ఉంటుందన్నారు. ఇక ప్రతి ఏటా జనవరి 27వ తేదీని యూనిఫాం సివిల్ కోడ్ డేగా జరపాలని నిర్ణయించినట్లు సీఎం దామి ప్రకటించారు. అలాగే అన్ని మతాలలో వివాహానికి కనీస వయస్సు తప్పని సరి చేశామన్నారు.
అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు ఉండాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భర్త లేదా భార్య జీవించి ఉండగా.. రెండవ వివాహం పూర్తిగా నిషేధించబడిందన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌లో అందుకు సంబంధించి స్పష్టమైన చట్టాలు చేయబడ్డాయని ఆయన సోదాహరణగా వివరించారు.
Also Read: స్కూల్‌లో జెండా ఎగరవేస్తుండగా ప్రిన్సిపాల్ అరెస్ట్.. ఎందుకో తెలిస్తే..ముక్కున వేలేసుకుంటారు
Also Read: ప్రధాని మోదీకి పేద ప్రజల కంటే ‘వారే’ ముఖ్యం
వివక్షను రూపుమాపేందుకు యూనిఫాం సివిల్ కోడ్.. రాజ్యాంగపరమైన చర్యగా సీఎం దామి అభివర్ణించారు. దీని ద్వారా పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే ప్రయత్నం చేశామన్నారు. దీని అమలు ద్వారా మహిళా సాధికారతకు అర్థం చేకూరుతోందని తెలిపారు. దీని అమలుతో బహు భార్యత్వం, బాల్య వివాహాలు, ట్రిపుల్ తలాక్ తదితర దురాచారాలను పూర్తిగా అరికట్టవచ్చునని ఆయన అబిప్రాయపడ్డారు.
Also Read: కీలక నేతల ఇలాకాలో వైసీపీకి బిగ్ షాక్.. ఆ నేతలంతా జనసేనలోకే..
Also Read: టెన్త్ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వేలల్లో ఖాళీలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 కింద పేర్కొన్న షెడ్యూల్డ్ తెగలను ఈ కోడ్ నుంచి దూరంగా ఉంచామని వివరించారు. తద్వారా ఆయా తెగలతోపాటు వారి హక్కులను రక్షించ వచ్చునని తెలిపారు. ఈ యూనిఫాం సివిల్ కోడ్.. ఏ మతానికి లేదా ఓ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. అదే విధంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకునే దీనిని అమలు చేయడం చేయలేదని సీఎం స్పష్టం చేశారు. ఇక ఈ చట్టం అమలుకు గుర్తుగా యూసీసీ పోర్టల్‌ను సీఎం దామి ఈ రోజు ప్రారంభించారు.
For National News And Telugu News