Share News

Delhi Elections: సీఈసీకి బీజేపీ ఆఫర్..?: కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 03 , 2025 | 02:44 PM

బీజేపీకి సీఈసీ లొంగిపోవడం చూస్తుంటే ఎన్నికల కమిషన్ తన అస్థిత్వం కోల్పోయినట్టు కనిపిస్తోందని కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. ఈ నెలాఖరులతో సీఈసీ రిటైర్ అవుతుండటంతో ప్రజల మనసుల్లో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు.

Delhi Elections: సీఈసీకి బీజేపీ ఆఫర్..?: కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరి కొద్ది గంటల్లోనే ముగియాల్సి ఉన్న తరుణంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి సీఈసీ లొంగిపోవడం చూస్తుంటే ఎన్నికల కమిషన్ తన అస్థిత్వం కోల్పోయినట్టు కనిపిస్తోందని అన్నారు. ఈ నెలాఖరులతో సీఈసీ రిటైర్ అవుతుండటంతో ప్రజల మనసుల్లో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. ''రిటైర్మెంట్ తరువాత ఆయనకు ఏ పోస్ట్ ఆఫర్ చేశారు, గవర్నర్ పోస్టా, రాష్ట్రపతి పోస్టా? ఏ పోస్ట్ కావచ్చు?'' అని మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ అన్నారు.

Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..


''రాజీవ్ కుమార్‌ను ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నాను. మీ బాధ్యతలను మీరు న్యాయబద్ధంగా నిర్వర్తించండి. పదవి కోసం పాకులాడవద్దు. మీ పదవీకాలం చివర్లో దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయవద్దు'' అని కేజ్రీవాల్ కోరారు.


న్యూఢిల్లీ నియోజకవర్గంలో డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ ప్రత్యర్థి పర్వేష్ వర్మపైన కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ చేష్టలుడిగి చూస్తోందని అన్నారు. ఆప్ కార్యకర్తలను ప్రచారం చేయకుండా బీజేపీ అడ్డుకుంటోందని, దాడులు చేస్తోందని ఆరోపించారు. న్యూఢిల్లీ నియోజకవర్గానికి ప్రత్యేక పరిశీలకులను నియమించాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంది. ఆప్ అభ్యర్థిగా కేజ్రీవాల్ పోటీలో ఉండగా, బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ పోటీ పడుతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.


Microsoft: మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాక్‌!

Cancer in India: దేశానికి క్యాన్సర్‌ సవాల్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 03:37 PM