ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:04 AM
భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియమకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన వారికి ‘ఐఎన్‌ఎస్ చిల్కా’లో శిక్షణ ఉంటుంది. 2025, 2026 బ్యాచ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది....

ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు
భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియమకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన వారికి ‘ఐఎన్‌ఎస్ చిల్కా’లో శిక్షణ ఉంటుంది. 2025, 2026 బ్యాచ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది.
ప్రకటన పేరు: అగ్నివీర్(మెట్రిక్ రిక్రూట్-ఎంఆర్) ఖాళీలు
అర్హత: పదో తరగతి పాసైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వయస్సు: 02/2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు 2004 సెప్టెంబరు 1 నుంచి 2008 ఫిబ్రవరి 29 మధ్యలో జన్మించి ఉండాలి. 01/2026 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు 2005 ఫిబ్రవరి 1 నుంచి 2008 జూలై 31 లోపు జన్మించి ఉండాలి. 02/2026 బ్యాంక్ కోసం దరఖాస్తు చేసుకునే వారు 2005 సెప్టెంబరు 1 నుంచి 2008 డిసెంబర్ 31లోపు జన్మించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: నేవీ ఎంట్రెన్స్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష, వైద్య పరీక్ష ఉంటాయి.
పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 50 మల్టిపుల్ ఆన్సర్ ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్, సైన్స్, మేథ్స్, జనరల్ అవేర్‌నెస్ నాలుగు విభాగాలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి.
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 10
ఎంట్రెన్స్ టెస్ట్: 2025 మే 25న
వెబ్‌సైట్ : https://www.joinindiannavy.gov.in/
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..