Share News

ఐఐఐటీ శ్రీసిటీలో ఎంటెక్‌

ABN , Publish Date - Mar 10 , 2025 | 03:51 AM

గ్లోబల్‌ సెమీ కండక్టర్‌ ఇండస్ట్రీ 2026 నాటికి 64 బిలియన్‌ డాలర్లు చేరుకుని, 2030 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్లు దాటుతుందని మెకిన్సే కంపెనీ అంచనా వేసింది. అందువల్ల వీఎల్‌ఎ్‌సఐ, ఐవోటీ, సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కు...

ఐఐఐటీ శ్రీసిటీలో ఎంటెక్‌

వీఎల్‌ఎ్‌సఐ, ఐవోటీ, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలైజేషన్‌

గ్లోబల్‌ సెమీ కండక్టర్‌ ఇండస్ట్రీ 2026 నాటికి 64 బిలియన్‌ డాలర్లు చేరుకుని, 2030 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్లు దాటుతుందని మెకిన్సే కంపెనీ అంచనా వేసింది. అందువల్ల వీఎల్‌ఎ్‌సఐ, ఐవోటీ, సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్‌ విపరీతంగా ఉంటుందని చెబుతోంది. అలాగే 2025 సంవత్సరం చివరి నాటికి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) మార్కెట్‌ రెండు బిలియన్‌ డాలర్లు ఉండవచ్చని నాస్కామ్‌ చెబుతోంది. అటానమస్‌ వెహికిల్స్‌, డ్రోన్లు తదితరాల కారణంగా ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, అటానమస్‌ టెక్నాలజీ అవసరాలు పెరుగుతున్నాయి. ఇక సైబర్‌ సెక్యూరిటీ గురించి చెప్పాల్సిన పని లేదు. 2025 చివరి నాటికే ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో తమ కంపెనీ సైబర్‌ సెక్యూరిటీ బడ్జెట్‌ను అన్ని కంపెనీలు రెండింతలు చేయనున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరులోని శ్రీసిటీలో ఉన్న ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’(ఐఐఐటీ) ఎడ్‌ కంపెనీ టీమ్‌ లీజ్‌తో కలిసి అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లు ప్రారంభించింది. వీఎల్‌ఎ్‌సఐ, ఐవోటీ అండ్‌ అటానమస్‌ సిస్టమ్స్‌, సైబర్‌ సెక్యూరిటీల్లో ఈ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.


ఎంటెక్‌ - వీఎల్‌ఎ్‌సఐ: సెమీ కండక్టర్‌ టెక్నాలజీస్‌, డిజిటల్‌, అనలాగ్‌ సర్క్యూట్‌ డిజైన్‌, సిస్టమ్‌ ఆన్‌ చిప్‌ డెవల్‌పమెంట్‌పై కోర్సు ఉంటుంది. దీనితోపాటులో పవర్‌ వీఎల్‌ఎ్‌సఐ, నానో స్కేల్‌ డివైజెస్‌, మిక్స్‌డ్‌ సర్క్యూట్‌ డిజైన్‌లపై ఫోకస్‌ ఉంటుంది. సెమీ కండక్టర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, చిప్‌ డిజైన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌ రోల్స్‌ కోసం పనిచేసేలా విద్యార్థులను తయారు చేస్తారు.

ఎంటెక్‌ - ఐవోటీ అండ్‌ అటానమస్‌ సిస్టమ్స్‌: ఐవోటీ ఆర్కిటెక్చర్‌, సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌, అటానమస్‌ డెసిషన్‌ మేకింగ్‌, అడ్వాన్స్‌డ్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్స్‌, 5జీ/6జీ టెక్నాలజీస్‌, డిజిటల్‌ ట్విన్‌ అప్లికేషన్స్‌ తదితరాల్లో ప్రావీణ్యం ఉండేలా రూపొందిస్తున్నారు.

ఎంటెక్‌-సైబర్‌ సెక్యూరిటీ: క్రిప్టోగ్రఫి, ఎథికల్‌ హాకింగ్‌, క్లౌడ్‌ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత థ్రెట్‌ డెసిషన్‌ తదితరాల్లో నాలెడ్జ్‌ ఉండేలా రూపొందించారు. బ్లాక్‌చైన్‌ అప్లికేషన్స్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ లాంటి వాటిలో హ్యాండ్స్‌ ఆన్‌ ఎక్స్‌పీరియన్‌ వచ్చేలా చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు తదితరాల సైబర్‌ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌ పరిష్కరించేలా ఉంటారు. 2025 జూలై నుంచి ఈ కోర్సులు ప్రారంభం అవుతాయి. సంవత్సరంలో ఒక వారం క్యాంపస్‌కి రావాల్సి ఉంటుంది. మిగిలిన క్లాసులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బీటెక్‌/బీఈ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ డిగ్రీని పూర్తిచేయాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 50 శాతం చాలు. అభ్యర్థులకు ‘గేట్‌’ స్కోరు తప్పనిసరి కాదు.

ఫీజు: సెమిస్టరుకు రూ. 65000/- చొప్పున నాలుగు సెమిస్టర్లకి కలిపి రూ. 2,60,000/- అవుతుంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌, ఫోన్‌లను సంప్రదించవచ్చు.

040-49170726, admission@iiitsricityonline.com

https://cep.digivarsity.com/iiit-sricity/


Read Also : Business Ideas: రోజులో రెండు గంటలు ఈ పనిచేస్తే చాలు.. మహిళలకు ఇంటి ..

Business Plan : డబ్బుకు డబ్బు.. ఇంట్లోనే పని.. మహిళల కోసం బెస్ట్ ...

Business Ideas: పీఎం మోడీ చెప్పిన ఈ పంటకు పెట్టుబడి రూ.20వేలు ...

Updated Date - Mar 10 , 2025 | 03:51 AM