ఇండియన్ ఆర్మీలో క్రీడా కోటా
ABN , Publish Date - Jan 20 , 2025 | 05:10 AM
ఇండియన్ ఆర్మీలో హవల్దార్, నాయబ్ సుబేదార్(క్రీడా కోటా) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అవివాహితులైన పురుష, మహిళా అభ్యర్థులు ఈ డైరెక్ట్ ఎంట్రీ ఉద్యోగాలకు...

ఇండియన్ ఆర్మీలో క్రీడా కోటా
ఇండియన్ ఆర్మీలో హవల్దార్, నాయబ్ సుబేదార్(క్రీడా కోటా) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అవివాహితులైన పురుష, మహిళా అభ్యర్థులు ఈ డైరెక్ట్ ఎంట్రీ ఉద్యోగాలకు 2025 ఫిబ్రవరి 28లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, అర్చరీ, బాస్కెట్‌ల్, బాక్సింగ్, డైవింగ్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్‌బాల్, జూడో, కయాకింగ్ అండ్ కెనోయింగ్, కబడ్డీ, స్మిమ్మింగ్, సెయిలింగ్, షైటింగ్, ట్రయాథ్లాన్, వాలీబాల్, వుషు, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, రోయింగ్.
అర్హత: పది/ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు, నిర్దుష్టమైన శారీరక ప్రమాణాలు ఉండాలి. అంతర్జాతీయ/జూనియర్ లేదా సీనియర్ నేషనల్ చాంపియన్‌షి్‌ప/ ఖేలో ఇండియా గేమ్స్/ యూత్ గేమ్స్/ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులై ఉండాలి.
వయస్సు: పదిహేడున్నర సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 2000 మార్చి 31 నుంచి 2007 ఏప్రిల్ 1వ తేదీ మధ్యలో జన్మించి ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అండ్ స్పోర్ట్స్, జనరల్ స్టాఫ్ బ్రాంచ్, ఐహెచ్‌క్యూ(ఆర్మీ), రూమ్ నెం.747, ‘ఏ’ వింగ్, సేనా భవన్, న్యూఢిల్లీ చిరునామాకు పంపించాలి.
పూర్తి వివరాలకు https://joinindianarmy.nic.in/ Authentication.aspx వెబ్‌సైట్ చూడవచ్చు.