తోటి ప్రవాసీలకు సాయపడ్డ తెలుగు మహిళకు దుబాయ్‌లో పురస్కారం
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:36 PM
స్వదేశానికి తిరిగి వెళ్ళే ప్రవాసీయులకు సహాయం చేసినందుకు దుబాయిలోని తెలుగు ప్రవాసీ ప్రముఖురాలు, విశాఖపట్టణం నగరానికి చెందిన విమలా ఫ్లోరెన్స్‌ను దుబాయిలోని భారతీయ కాన్సులేటు ఇటీవల సత్కరించింది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష పథకం సందర్భంగా స్వదేశానికి తిరిగి వెళ్ళే ప్రవాసీయులకు సహాయం చేసినందుకు దుబాయిలోని తెలుగు ప్రవాసీ ప్రముఖురాలు, విశాఖపట్టణం నగరానికి చెందిన విమలా ఫ్లోరెన్స్‌ను దుబాయిలోని భారతీయ కాన్సులేటు ఇటీవల సత్కరించింది (NRI).
TKS: హోరాహోరీగా ఒమాన్ టి.కె.యస్ ఎన్నికలు!
కాన్సులేట్‌లో ఆమె ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ తరపున వాలంటీరుగా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లందర్నీ కాన్సులేట్ ఆవరణలో కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సర్టిఫికేట్‌ను అందజేసి అభినందించారు.
దుబాయి, ఇతర ఎమిరేట్లలో మహిళలకు సామాజిక కార్యక్రమాలతో పాటు బాలికలకు కళలు, సాంస్కృతిక, నృత్య రంగాలలో శిక్షణ కూడా ఇచ్చే విమలకు సౌమ్యురాలిగా, వివాదరహితురాలిగా పేరు. క్షమాభిక్ష సందర్భంగా తనకు సహకరించిన తెలుగు ప్రవాసీయులందరికి విమల కృతజ్ఞతలు తెలిపారు.