CM Revanth Reddy: బీసీ పోరు గర్జనలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Apr 03 , 2025 | 08:29 AM
ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నాడు మహాధర్నా జరిగింది. బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంపుపై మహాధర్నా చేపట్టారు. 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులను ఆమోదించినట్లు బీసీ సంఘాల నేతలు తెలిపారు. పార్లమెంట్‌లోనూ బిల్లులు ఆమోదించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఢిల్లీలో బుధవారం నాడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంపుపై మహాధర్నా చేపట్టారు.

ఈ మహాధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

బీసీలు ధర్మయుద్ధం ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపకపోతే.. ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

‘మా డిమాండ్లకు దిగి రావాలి.. లేదంటే మీరే దిగిపోవాలి.. మేం ఇక ఢిల్లీకి రాబోం.. మోదీయే మా గల్లీకి రావాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

తాము ఇప్పుడు సయోధ్యకు వచ్చాం.. రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Updated at - Apr 03 , 2025 | 08:33 AM