Share News

Funny Viral Video: ఎక్కడ డాన్స్ చేస్తున్నామనేది కూడా ఇంపార్టెంట్.. ఇతడి పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Apr 09 , 2025 | 09:13 AM

ఓ ప్రాంతంలో చాలా మంది జనం గుమికూడి డాన్స్ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటారు. మరికొందరు ఇళ్లపైకి ఎక్కి మరీ తిలకిస్తుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘చూసుకోవాలి కదా బ్రో‘‘.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Funny Viral Video: ఎక్కడ డాన్స్ చేస్తున్నామనేది కూడా ఇంపార్టెంట్.. ఇతడి పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..

కొందరు అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు ప్రాంక్ వీడియోలు చేస్తూ షాక్ ఇస్తుంటారు. ఇంకొందరైతే పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ తెగ నవ్విస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి అందరిలో డాన్స్ చేస్తూ బిల్డప్ ఇచ్చాడు. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ ఎక్కడ డాన్స్ చేస్తున్నామనేది కూడా ఇంపార్టెంట్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రాంతంలో చాలా మంది జనం గుమికూడి డాన్స్ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటారు. మరికొందరు ఇళ్లపైకి ఎక్కి మరీ తిలకిస్తుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. కొందరు ఓ ఇంటి పక్కన ప్రహరీ గోడపై కూర్చుని ఉంటారు.

Deer Funny Video: జింకే కదా అని సెల్ఫీ దిగింది.. చివరకు దాని రియాక్షన్ చూసి ఖంగుతింది..


ఇంతలో అక్కడ నాగిని డాన్స్ ప్రారంభమవుతుంది. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అందరి ముందూ బిల్డప్ ఇస్తూ డాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ప్రహరీ గోడపై ప్రమాదకరంగా కాళ్లను అటూ, ఇటూ కదుపుతూ డాన్స్ చేస్తాడు. అయితే ఇలా ముందుకు, వెనక్కు తిరిగే సమయంలో అదుపు తప్పి ( young man fell while dancing) ఒక్కసారిగా ధబేల్‌మని కిందపడిపోతాడు. ఈ ఘటనతో అప్పటిదాకా సైలెంట్‌గా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకుంటారు.

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ నాగిని ఎటు వెళ్లిందో అర్థం కావట్లేదే’’.. అంటూ కొందరు, ‘‘ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో అయింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏం వాడుకుంటున్నార్రా... రైలు బోగీలో ఏముందో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2025 | 09:13 AM