Monkey Helping Video: గోతిలో పడిపోయిన పిల్లి.. లోపలికి దూకిన కోతి.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:16 AM
ఓ పిల్లి ప్రమాదవశాత్తు చిన్న బావిలో పడిపోయి.. బయటికి రాలేక ఇబ్బంది పడుతుంటుంది. ఇంతలో అటుగా వకెళ్లినో ఓ కోతి.. పిల్లిని గమనిస్తుంది. దాని ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలకు తెగించి అందులోకి దిగుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనుషుల చేతుల్లో ఆహార పదార్థాలను లాక్కోవడం, ఇళ్లల్లోని వస్తువులను ఎత్తుకెళ్లే కోతులను నిత్యం చూస్తుంటాం. అయితే ఇదే కోతులు సాయం కూడా చేస్తుంటాయి. మరికొన్ని కోతులు తమ ప్రాణాలకు తెగించి, మిగతా జంతువుల ప్రాణాలను కాపాడుతుంటాయి. ఇలాంటి మానవత్వం గల కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లి గోతిలో పడిపోయిన బయటికి రాలేక ఇబ్బంది పడుతోంది. దీన్ని గమనించిన కోతి.. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి ప్రమాదవశాత్తు చిన్న బావిలో పడిపోయి.. (Cat Fell into Well) బయటికి రాలేక ఇబ్బంది పడుతుంటుంది. ఇంతలో అటుగా వకెళ్లినో ఓ కోతి.. పిల్లిని గమనిస్తుంది. దాని ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలకు తెగించి అందులోకి దిగుతుంది. పిల్లిని పట్టుకుని బయటికి తీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది.
ఈ క్రమంలో పిల్లిని గాల్లోకి విసిరి (Monkey tries to save cat) బయట పడేయాలని చూస్తుంది. అయితే పిల్లి బరువుగా ఉండడంతో అది సాధ్యం కాదు. ఎలాగైనా దాన్ని కాపాడాలని అటూ, ఇటూ తిరుగుతూ శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా పిల్లిని బయటికి తీయడం సాధ్యం కాదు. దీంతో కోతి తెగ బాధపడిపోతుంది. అయితే చివరకు అక్కడే ఉన్న మహిళ.. బావిలోకి దిగి పిల్లిని బయటికి తీస్తుంది. పిల్లిని బయటికి తీయగానే కోతి దాన్ని గట్టిగా హత్తుకుని ప్రేమగా నిమురుతుంటుంది. ఆమె పిల్లిపై నీళ్లు పోసి శుభ్రం చేస్తుండగా కోతి అక్కడే ఉంటూ పిల్లిని గమనిస్తూనే ఉంటుంది.
ఇలా తమ జాతి కాకపోయినా.. పిల్లిని కాపాడేందుకు కోతి చేసిన ప్రయత్నం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనుషుల కంటే కోతులు ఎంతో నయం’’.. అంటూ కొందరు, ‘‘పిల్లి కోసం కోతి పడిన తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అంటూ మరికొందరు, ‘‘వ్యూస్ కోసం ఇలా జంతువులను ఇబ్బంది పెట్టకండి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23 వేలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..