Fact Check : రూ.3 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. కొందామనుకొంటున్నారా
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:17 PM
Fact Check: రెండు చక్రాల సైకిల్ ధర ప్రస్తుతం ఎంత ఉంది. రూ. 5 వేలు ఉంది. అలాంటి వేళ.. ఎలక్ట్రిక్ సైకిల్. అది కూడా జస్ట్ రూ. 3 వేలకు లభిస్తే ఎలా ఉంటుంది. అదికూడా ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. 108 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చు. మరి అలాంటి సైకిల్ మార్కెట్‌లోకి వస్తే మాత్రం..

దేశంలోని మహానగరాలన్నీ కాలుష్యపు కోరల్లో చిక్కుకు పోతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో అయితే కాలుష్యం అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ కేంద్రం ప్రభుత్వాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు కాస్తా ఘాటుగా ప్రశ్నించింది. అలాంటి వేళ వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. దీంతో ఇబ్బడి ముబ్బడిగా ఎలక్ట్రిక్ వాహనాలు రహదారులపైకి వచ్చాయి.. వస్తున్నాయి.
అయితే తాజాగా రూ.3,248లకే టాటా సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారీ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తుందంటూ సోషల్ మీడియాలో కథనాలు అయితే వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వీటిని కోనుగోలు చేసేందుకు ప్రజలంతా తీవ్ర ఆసక్తి కనబరిచారు. ఎందుకంటే.. రూ.3 వేలకు కనీసం సైకిల్ సైతం రావడం లేదని.. కొత్త సైకిల్ కొనుగోలు చేయాలంటే రూ.5 వేలు పట్టుకోవాల్సి ఉందని చెబుతున్నారు.
అలాంటి వేళ రూ.3 వేలకు చీప్ అండ్ బెస్ట్‌లో వస్తున్న ఎలక్ట్రిక్ సైకిల్‌ను కొనుగోలు చేసేందుకు వారంతా ఉత్సాహం చూపించారు. అదీకాక ఈ టాటా సంస్థ నుంచి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఒక్కసారి ఛార్జీంగ్ పెడితే..108 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చునంటూ సదరు కథనాల్లో ప్రచురితమైంది. ఈ వైరల్ అవుతోన్న కథనాలపై టాటా సంస్థ స్పందించింది.
Also Read: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు
ఈ కథనాల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తాము ఈ తరహా సైకిళ్ల తయారీ చేపట్టలేదని సంస్థ కుండబద్దలు కొట్టింది. ఓ వైళ.. సైకిళ్లు మార్కెట్‌లోకి వస్తే.. వాటిని కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం అది తమ బాధ్యత కాదని టాటా సంస్థ కుండబద్దలు కొట్టింది.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..