Saif Ali Khan: హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు సైఫ్ ఎంతిచ్చాడు? రివార్డు గురించి భజన్ సింగ్ ఏమన్నాడంటే..
ABN , Publish Date - Jan 23 , 2025 | 06:49 PM
తీవ్ర గాయాలతో ఉన్న సైఫ్‌ను ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రానా లీలావతి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. తన ఆటోలో ఉన్నది సైఫ్ అని తెలుసుకుని షాకయ్యాడు. హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్లిపోయాడు. సైఫ్‌ను సకాలంలో హాస్పిటల్‌కు చేర్చిన భజన్‌సింగ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ముంబైలోని తన ఇంట్లోనే దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) చికిత్స అనంతరం లీలావతి హాస్పిటల్ (Lilavati hospital) నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న సైఫ్‌ను ఆటోడ్రైవర్ (Saif in Auto) భజన్ సింగ్ రానా లీలావతి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. తన ఆటోలో ఉన్నది సైఫ్ అని తెలుసుకుని షాకయ్యాడు. హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్లిపోయాడు. సైఫ్‌ను సకాలంలో హాస్పిటల్‌కు చేర్చిన భజన్‌సింగ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సంస్థ అతడికి కొంత నగదు బహుమతిని కూడా అందించింది (Attack on Saif Ali Khan).
లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు అక్కడే ఆటో డ్రైవర్ భజన్ సింగ్‌ను సైఫ్ అలీ ఖాన్ కలిశాడు. అతడికి ధన్యవాదాలు తెలియజేసి కౌగిలించుకున్నాడు. అంతేకాదు అతడికి పెద్ద మొత్తంలో రివార్డు కూడా ఇస్తానని హామీ ఇచ్చాడట. అయితే అది ఎంత అనే విషయాన్ని మాత్రం మీడియాకు వెల్లడించవద్దని భజన్ సింగ్‌ను సైఫ్ కోరాడట. సైఫ్ నుంచి భజన్ రూ. 50 వేల నుంచి లక్ష వరకు తీసుకుని ఉండవచ్చని పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే సైఫ్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఆ రివార్డు గురించి వెల్లడించలేనని భజన్ తెలిపాడు.
``నేను రివార్డ్ గురించి అడగలేదు. కానీ, అతడు నాకు ఏదైనా బహుమతి ఇస్తానంటే సగర్వంగా తీసుకుంటా. నేను ఏదో ఆశించి ఆ పని చేయలేదు. నాకు రివార్డు రావాలని కూడా నేను ఆశించడం లేదు`` అని భజన్ సింగ్ పేర్కొన్నాడు. దాడి సమయంలో ఇంట్లో కార్లు లేకపోవడంతో సైఫ్ పెద్ద కొడుకు అతడిని భజన్ సింగ్ ఆటోలో లీలావతి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. తన ఆటోలో ఉన్నది సైఫ్ అని తెలుసుకున్న తర్వాత భజన్ ఆశ్చర్యపోయాడు. వారి దగ్గర నుంచి డబ్బులేమీ తీసుకోకుండానే హాస్పిటల్ నుంచి వెళ్లిపోయాడు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..