Kerala Viral News: ఆఫీసులో కుక్కలా పాకుతున్న ఉద్యోగి.. కారణమేంటా అని విచారించగా ..
ABN , Publish Date - Apr 06 , 2025 | 10:01 AM
ఓ ఆఫీసులో ఉద్యోగి కుక్కలా పాకుతున్నాడు. అతడి పక్కనే ఓ వ్యక్తి నిలబడి శిక్ష విధిస్తున్నట్లుగా ఉంది. ఇలా అతను చాలా దూరం వరకూ కుక్కలా పాకుతుండగా.. మరో వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి..

ప్రైవేట్ కంపెనీలో సిబ్బందికి వివిధ రకాల టార్గెట్‌లు విధిస్తుంటారు. సిబ్బంది పని తీరు మెరుగుపరచేందుకు, కంపెనీ లక్ష్యాలను సాధించే క్రమంలో కొన్ని నిబంధనలు విధించడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కంపెనీలను బట్టి ఈ టార్గెట్లు మారుతుంటాయి. అయితే లక్ష్యాలను సాధించిన సిబ్బందికి కంపెనీ యాజమాన్యం కూడా అనేక రకాల ప్రోత్సాహకాలను అందిస్తుంటుంది. ఈ విషయం పక్కన పెడితే తాజగా, కేరళలో చోటు చేసుకున్న విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆఫీసులో కుక్కలా పాకుతున్నట్లుగా ఉన్న ఫొటోలు, వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఓ ఆఫీసులో ఉద్యోగి కుక్కలా పాకుతున్నాడు. అతడి పక్కనే ఓ వ్యక్తి నిలబడి శిక్ష విధిస్తున్నట్లుగా ఉంది. ఇలా అతను చాలా దూరం వరకూ కుక్కలా పాకుతుండగా.. మరో వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మార్కెటింగ్ కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది లక్ష్యాలను చేరుకోలేకపోడంతో ఇలా గొలుసులతో బంధించి, కుక్కలా పాకిస్తున్నారని ప్రచారం జరిగింది.
అలాగే మరో వీడియోలో సిబ్బందిని తమకు తాముగా బట్టలు విప్పి నిలబడుకోవాలని కూడా శిక్ష విధిస్తున్నట్లుగా ఉంది. టార్గెట్ చేరుకోలేదనే కారణంతో సిబ్బందిని ఇలా టార్చర్ చేస్తున్నారని సదరు సంస్థ ఉద్యోగులుగా చెప్పుకొనే కొంత మంది స్థానిక మీడియాకు తెలిపారు. ఈ వీడియోలు వైరల్ అవడంతో చివరకు రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వి. శివన్‌కుట్టి దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ దృశ్యాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని, కేరణలో ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసు విచారణలో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది.
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..
వారు తెలిపిన వివరాల మేరకు.. కేరళ (Kerala) కొచ్చిలోని ఓ ప్రైవేంట్ మార్కెటింగ్ కంపెనీలో ఈ ఘటన జరిగినట్లుగా చిత్రీకరించారని తెలుస్తోంది. సదరు సంస్థలో పని చేసిన మాజీ మేనేజర్‌కు కంపెనీతో విభేదాలు ఉన్నాయని, దీంతో కంపెనీకి చెడ్డ పేరు వచ్చేలా ఇలా వీడియోను క్రియేట్ చేసినట్లు తెలిసింది. ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిందని పోలీసులు తేల్చారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. అలాగే కేరళ రాష్ట్ర యువజన కమిషన్ కూడా స్పందించింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
King Cobra Viral Video: ఇతడి కాన్ఫిడెన్స్ లెవల్ పీక్స్‌లో ఉన్నట్టుందే.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే..
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..