Viral: భార్యపై ఇలాంటి రివెంజ్ తీర్చుకోవడం మీరెక్కడా చూసుండరు!
ABN , Publish Date - Feb 08 , 2025 | 09:43 PM
డైవర్స్ కోసం కోర్టుకెక్కిన భార్యను వేధించేందుకు ఓ వ్యక్తి తుంటరి పనికి తెరతీశాడు. మహిళ పేరిట ఉన్న బైక్‌తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఆమెతో చలానాలు కట్టించాడు.

ఇంటర్నెట్ డెస్క్: డైవర్స్ కావాలంటూ కోర్టుకెక్కిన భార్యపై ఓ వ్యక్తి వింత రివెంజ్‌కు పాల్పడ్డాడు. ఆమె పేరిట ఉన్న బైక్‌తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి ఆమెపై జరిమానాల భారం తడిసిమోపెడయ్యేలా చేశాడు. యూపీలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం నెట్టింట ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, సదరు మహిళది యూపీలోని ముజఫర్‌పూర్. గతేడాది ఆమెకు బీహార్‌లోని పట్నాకు చెందిన ఓ యువకుడితో వివాహమైంది. పెళ్లైన నెల రోజులకే భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు మొదలయ్యాయి. దీంతో, ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. వారి డైవర్స్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే, పెళ్లి సమయంలో మహిళ తండ్రి అల్లుడికి ఓ బైక్‌ను కట్నంగా ఇచ్చారు. అయితే, వాహనం మాత్రం తన కూతురి పేరిటే రిజిస్టర్ చేశారు (Viral).
CIBIL Score: సిబిల్ స్కోరు తక్కువగా ఉన్న వరుడికి షాక్! చివరి నిమిషంలో పెళ్లి రద్దు!
ఇక మహిళ పుట్టింటికి వచ్చాక కూడా అతడు బైక్‌కు తిరిగివ్వలేదు. ఇది చాలదన్నట్టు బైక్ నడుపుతూ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో, ట్రాఫిక్ పోలీసులు చలానాలను మహిళకు పంపించారు. మొదట్లో ఇలా జరిగితే ఏమోలే అని అనుకున్న మహిళ టైం ప్రకారం చలానాలు కట్టేసింది. కానీ చలానాల భారం పెరుగుతున్న కొద్దీ భర్త కుట్ర అర్థమై ఆమెకు ఒళ్లు మండింది. చివరకు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. గత మూడు నెలల్లోనే నాలుగు సార్లు చలానాలు వచ్చాయని ఆమె వాపోయింది. మరోవైపు, ఆమె భర్త మాత్రం యథాప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ భార్యను ఇబ్బంది పెట్టసాగాడు. అంతేకాకుండా, డైవర్స్ ఖరారయ్యే వరకూ బైక్ ఇచ్చేదే లేదని తెగేసి చెప్పాడు.
Washing Clothes in Space: అంతరిక్షంలో వ్యోమగాములు దుస్తులు ఉతుక్కుంటారా?
భర్త వేధింపులు తట్టుకోలేక తొలుత మహిళ పట్నా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని వారు మహిళకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రితో కలిసి తమ స్వస్థలంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, బైక్ భర్తే నడుపుతున్నట్టు నిర్ధారిస్తూ ఓ అఫిడవిట్ సమర్పించాలని వారు సూచించారు. ఈ కేసుల ఇది ఆధారంగా మారుతుందని చెప్పారు. అయితే, భార్యను వేధించేందుకు భర్త చేసిన ఈ తుంటరి పని స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఉదంతంపై జనాలు తమకు తోచిన కామెంట్స్ చేస్తున్నారు.