Share News

Live Death Video: అడుగు దూరంలో మరణం.. గుండెల్ని మెలిపెట్టే సీన్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Apr 16 , 2025 | 09:13 AM

కొన్నిసార్లు ఒక్క అడుగు కూడా మరణానికి దారి తీయొచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది..

Live Death Video: అడుగు దూరంలో మరణం.. గుండెల్ని మెలిపెట్టే సీన్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

‘‘కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు కాలమే జీవితం’’.. అన్న మహా కవి శ్రీశ్రీ అన్నట్లుగా.. మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు కాస్తా.. అంతలోనే మృత్యుఒడిలోకి జారుకుంటుంటారు. కొన్నిసార్లు ఒక్క అడుగు కూడా మరణానికి దారి తీయొచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఢిల్లీలోని (Delhi) చందర్ విహార్ వీధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఈ వీధిలో పాదచారులు అటూ, ఇటూ తిరుగుతుండగా సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చందర్ పాల్ (67) అనే వ్యక్తి ఇదే సమయంలో ఆ వీధిలో నడుస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో ఇంటి గోడ శిథిలాలు కూలి మీద పడ్డాయి.

Overnight Millionaire: తలరాతను మార్చిన పాత పాస్‌బుక్.. రాత్రికి రాత్రే లక్షాధికారి ఎలా అయ్యాడంటే..


రాళ్లు మీద పడగానే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మరికొందరు భయంతో పరుగులు తీశారు. తర్వాత అక్కడికి వచ్చి పరిశీలిస్తున్న వ్యక్తి మీద కూడా రాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో అతడితో పాటూ మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చందర్ పాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..


కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘భవన నిర్మాణ యజమానిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2025 | 09:13 AM