Viral Video: అబ్బాయిని వదిలేస్తారు.. అమ్మాయిని మాత్రం కాపాడతారా? ఈ వీడియో చూస్తే..
ABN , Publish Date - Feb 21 , 2025 | 06:38 PM
కొందరు అబ్బాయిల విషయంలో పక్షపాతం చూపిస్తే, మరికొందరు అమ్మాయిలకే మద్దతుగా మాట్లాడుతుంటారు. అయితే అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే మాత్రం సహాయం చేసేందుకు కొందరు వెంటనే ముందడుగు వేస్తారు. అదే అబ్బాయికి సహాయం చేసేందుకు అంత త్వరగా ముందుకు రారు.

ప్రతిరోజు అబ్బాయిలు (Boys), అమ్మాయిల (Girls) విషయంలో పక్షపాతం గురించి మాటలు వినబడుతూ ఉంటాయి. కొందరు అబ్బాయిల విషయంలో పక్షపాతం చూపిస్తే, మరికొందరు అమ్మాయిలకే మద్దతుగా మాట్లాడుతుంటారు. అయితే అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే మాత్రం సహాయం చేసేందుకు కొందరు వెంటనే ముందడుగు వేస్తారు. అదే అబ్బాయికి సహాయం చేసేందుకు అంత త్వరగా ముందుకు రారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి హాట్ హాట్ చర్చలో పాల్గొంటున్నారు (Viral Video).
kapoorshonee అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. భారీ వర్షం, వరదల కారణంగా ఓ కాలనీ నీటితో నిండిపోయింది. నీరు అతి వేగంగా ప్రవహిస్తోంది. ఆ నీటలో ఓ కుర్రవాడు కొట్టుకుని వెళ్లిపోతున్నాడు. పక్కన ఉన్న వారు అతడికి సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఆ వెంటనే, ఒక అమ్మాయి కూడా నీటిలో తేలుతూ కొట్టుకుపోతోంది. ఆమెను రక్షించడానికి మాత్రం ఇద్దరు వ్యక్తులు వెంటనే నీటిలోకి దూకారు. ఆమెను పట్టుకున్నారు. ఆ ఘటనను చిత్రీకరించిన ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొత్త చర్చకు తెరలేపాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చాలా మంది ఆ వీడియోపై తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ``అమ్మాయి కొంచెం బలహీనురాలు కాబట్టి ఆమెకు సహాయం చేయడానికి వచ్చారు``, ``చాలా మంది ఇలాగే చేస్తారు``, ``ఫెమినిజమ్ ఎప్పుడు మగవాడి నుంచే ప్రారంభమవుతుంది``, ``అబ్బాయి తనను తాను రక్షించుకోగలడే నమ్మకం ఉంటుంది``, ``ఇందులో తప్పేం ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Shocking: ఇదేందయ్యా ఇదీ.. ఎక్కడా చూడలేదే.. మేనేజర్ పెద్ద పాత్రలో కూర్చున్నాడేంటి? ఎందుకంటే..
Husband and wife: ఇలాంటి భార్య ఎక్కడైనా ఉంటుందా? భర్తకు ఇలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా?
Optical Illusion: జింక ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.. వేటగాడు ఎక్కడున్నాడో కనిపెట్టండి..
Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..