Share News

Civil Lines: దాదాపు అన్ని భారతీయ నగరాల్లో కనిపించే సివిల్ లైన్స్ గురించి తెలుసా?

ABN , Publish Date - Jan 17 , 2025 | 08:44 PM

భారత్‌లోని అనేక నగరాల్లో కనిపించే సివిల్ లైన్స్ ప్రాంతాల చరిత్ర ఏమిటో వివరిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బ్రిటీష్ వలసపాలకుల వివక్షకు ప్రతీకగా నిలుస్తున్న ఈ ప్రాంతాల చరిత్ర తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Civil Lines: దాదాపు అన్ని భారతీయ నగరాల్లో కనిపించే సివిల్ లైన్స్ గురించి తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు ప్రతి నగరంలోనూ సివిల్ లైన్స్ అనే ప్రాంతం ఒకటి ఉంటుంది. స్థానికుల నోట నిత్యం ఈ పదం వినిపిస్తుంటుంది. కానీ ఈ పదం పుట్టుక, దాని చరిత్ర గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే, నేటి ఇంటర్నెట్ జమానాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లయెన్సర్లు ఎక్కడెక్కడి విశేషాలను మన ముందుంచుతున్నారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే తీరులో విడమర్చి చెబుతున్నారు. తాజాగా వరుణ్ గర్గ్ అనే కంటెంట్ క్రియేటర్ సివిల్ లైన్స్ చరిత్ర గురించి వివరించారు (Viral)..


Viral: కుంభమేళాలో మోనాలిసా.. చూపు తిప్పుకోలేని అందం అంటే ఇదే!

ప్రయాగ్‌రాజ్, కాన్‌పూర్, రూర్కీ, ఢిల్లీ, బరేలీ, ఫతేపూర్ ఇలా అనేక నగరాల్లో సివిల్ లైన్స్ ఉన్నాయి. 1800ల్లో బ్రిటిష్ వలసపాలకులు భారత్‌పై తమ పట్టుబిగిస్తున్న తరుణంలో సివిల్ లైన్స్ ఉనికిలోకి వచ్చాయట. భారతీయులు అనాగరికులని, వారిని సంస్కరించాల్సిన బాధ్యత తమదేనంటూ అప్పట్లో చెప్పుకున్న బ్రిటీష్ పాలకులు తమ పాలనతో స్థానికులపై ప్రతి క్షణం వివక్ష ప్రదర్శించారు. భారతీయులపై పెత్తనం చేసేందుకు వచ్చిన బ్రిటీష్ అధికారులు తాము నివసించేందుకు ఓ ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ విలాసవంతమైన భవనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలా పౌర అధికారులు నివసించే ప్రాంతం కావడంతో వీటికి సివిల్ లైన్స్ అనే పేరు స్థిరపడింది.


Viral: విమానాల్లో కొబ్బరిని అనుమతించరు.. ఎందుకంటే..

ఇక సివిల్ లైన్స్‌లో స్థానికులకు అస్సలు అనుమతి ఉండేది కాదు. బ్రిటన్ అధికారులు మాత్రమే ఉండేవారు. భారతీయులు ఈ ప్రాంతాల్లోకి రావడం, కూర్చోవడం, తినడంపై పూర్తిస్థాయిలో నిషేధం అమల్లో ఉండేది. ఈ ప్రాంతాల్లో భారీ భవనాలు, బ్రిటన్ అధికారుల ఎంటర్‌టైన్‌‌మెంట్ కోసం క్లబ్స్ కూడా ఉండేవి. ఆ ప్రాంతంలోని అత్యంత ప్రముఖమైన బ్రిటీష్ వ్యక్తులు మాత్రమే ఉండేవారు. స్థానికులు వీటిని శ్వేతజాతీయుల ప్రాంతాలుగా చూసేవారు. అయితే, ప్రస్తుతం ఈ భవనాల్లో ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. ఇక వీడియోలో ఈ చరిత్ర గురించి తెలుసుకున్న జనాలు సదరు కంటెంట్ క్రియేటర్‌ను అభినందిస్తున్నారు.

Viral: పసిబిడ్డతో విమాన ప్రయాణం! టేకాఫ్‌లో జాప్యం జరగడంతో..

Viral: అత్త త్వరగా చనిపోవాలంటూ నోటుపై రాసి.. గుడి హుండీలో వేసి..

Read Latest and Viral News

Updated Date - Jan 17 , 2025 | 08:46 PM