SRH vs LSG Pat Cummins: వాళ్ల వల్లే మ్యాచ్ పోయింది.. కమిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:01 AM
IPL 2025: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్‌ను ఘనంగా ఆరంభించిన కమిన్స్ సేన.. ద్వితీయ విఘ్నాన్ని మాత్రం దాటలేకపోయింది. సొంత మైదానంలో హాట్ ఫేవరెట్‌గా దిగి లక్నో సూపర్ జియాంట్స్ చేతుల్లో ఓటమిపాలైంది ఎస్‌ఆర్‌హెచ్.

లాస్ట్ ఐపీఎల్‌లో మిస్ అయిన ట్రోఫీని ఈసారి ఎలాగైనా పట్టేయాలని చూస్తున్న సన్‌రైజర్స్‌కు భారీ ఝలక్ తగిలింది. కొత్త సీజన్‌ను గెలుపుతో మొదలుపెట్టిన కమిన్స్ సేన.. సెకండ్ ఫైట్‌లో తడబడింది. ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జియాంట్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది ఆరెంజ్ ఆర్మీ. లక్నోపై భారీ తేడాతో విక్టరీ సాధిస్తుందని, ఈ మ్యాచ్‌లో 300 రన్స్ మార్క్‌ను అందుకుంటుందని భావిస్తే అనూహ్యంగా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. అతడు ఏమన్నాడంటే..
వాళ్లు శాసించారు
లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని.. వాళ్లు తమ ఓటమిని శాసించారని అన్నాడు కమిన్స్. గత మ్యాచ్‌తో పోలిస్తే ఇది పూర్తిగా డిఫరెంట్ వికెట్ అని చెప్పాడు. వేగంగా పరుగులు చేయాల్సిందని.. కానీ అది సాధ్యం కాలేదన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో బాల్ మీద బౌలర్లకు మంచి గ్రిప్ లభించిందన్నాడు సన్‌రైజర్స్ సారథి. ఎల్‌ఎస్‌జీ బౌలర్లు మ్యాచ్ స్వరూపం మార్చేశారని మెచ్చుకున్నాడు. భారీ స్కోర్లు బాదాలంటే చివరి వరకు ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ ఆడాలని.. మొన్నటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌లా ఎవరైనా ఒక్కరు ఆడి ఉన్నా పరిస్థితి మరోలా ఉండేదన్నాడు కమిన్స్. రెండు జట్లకు మధ్య అదే డిఫరెన్స్ అన్నాడు. బిగ్ టోర్నమెంట్ కాబట్టి దీని నుంచి గుణపాఠాలు నేర్చుకొని.. మున్ముందు మ్యాచుల్లో మరింత బాగా ఆడేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు కమిన్స్.
ఇవీ చదవండి:
జియోస్టార్ నుంచి నయా అప్డేట్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి