Historical University: దేశంలోని ఈ యూనివర్శిటీని కాలబెడితే ఎన్ని నెలలు కాలిందో తెలుసా
ABN , Publish Date - Mar 28 , 2025 | 10:41 AM
భారతదేశంలో గుప్తుల కాలంలో స్థాపించిన నలందా విశ్వ విద్యాలయం.. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఇక్కడ సుమారు 10 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసించవారు. 2 వేల మంది టీచర్లు పాఠాలు బోధించారు. ఇక్కడి గ్రంథాలయంలో అక్షరాల కోటి పుస్తకాలు ఉండేవి. వందల ఏళ్ల పాటు ప్రపంచానికి జ్ఞానసంపద అందించిన యూనివర్శిటీ తురుష్కుల కాలంలో పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ వివరాలు..

సైన్స్, వైద్యం మొదలు అంతరిక్ష రంగం వరకు అనేక కొత్త విషయాలను మేమే కనిపెట్టామంటూ ప్రపంచలోని అగ్ర దేశాలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ కొన్ని వేల సంవత్సరాలకు ముందే.. భారతీయులు వాటిని గుర్తించి.. పరిశోధించి.. మరెన్నో అద్భుతాలకు ప్రాణం పోశారు. సున్నా కనిపెట్టడం, భూభ్రమణం, గ్రహాలు-వాటి గమనం, పుష్పక విమనాలు, అనస్థీషియా, ప్లాస్టిక్ సర్జరీ వంటి ఎన్నో అద్భుతాలు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో పురుడు పోసుకున్నాయి. ఆ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కోసం ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో విద్యార్థులు, యాత్రికులు, సన్యాసులు భారతదేశానికి వచ్చారు. ఇక్కడి జ్ఞాన సంపదను ప్రపంచ నలుచెరుగులా ప్రచారం చేశారు. ఇలా వచ్చే వారందరికి ఇక్కడి గురుకులాలు విజ్ఞానాన్ని పంచాయి. నేడు విదేశాల్లో ఉన్న యూనివర్శిటీలు టాప్ వర్శిటీలుగా పేరు పొందాయి కానీ.. ఒకప్పుడు భారతేదేశంలో విశ్వ విఖ్యాతి గాంచిన యునివర్శిటీలు విలసిల్లాయి. వాటిల్లో ముఖ్యమైనది నలందా విశ్వ విద్యాలయం.
నలంద విశ్వ విద్యాలయం.. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆవాస విశ్వ విద్యాలయంగా గుర్తింపు పొందింది. ఇది బిహార్‌లోని రాజ్‌గీర్ సమీపంలో ఉంది. క్రీశ427లో గుప్త సామ్రాజ్య చక్రవర్తి అయిన ఒకటవ కుమారగుప్తుడు.. ఈ విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు.క్రీశ 5-క్రీశ 13వ శతాబ్దం వరకు అనగా సుమారు 800 సంవత్సరాల పాటు విద్యా కేంద్రంగా విలసిల్లంది. నలందా విశ్వ విద్యాలయం.. భారతదేశ జ్ఞాన సంపదకు చిహ్నంగా నిలిచి.. ఆసియా చైనా, జపాన్, కొరియా, టిబెట్ వంటి దేశాల నుండి విద్యార్థులను ఆకర్షించింది.
నలందా విశ్వ విద్యాలయం.. బౌద్ధ విద్యకు కేంద్రంగా ఉండేది. ఇక్కడ మహాయాన బౌద్ధంతో పాటు గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య, తర్క, వ్యాకరణ శాస్త్రాలను బోధించేవారు. ప్రపంచంలోని అతి పెద్ద గ్రంథాలయం నలందా విశ్వవిద్యాయంలో ఉండేది. రత్న సాగర, రత్నోదధి, రత్న రంజక అనే మూడు భవనాలుగా ఉండే ఈ గ్రంథాలయంలో సుమారు 90 లక్షలకు పగా చేతి వ్రాత పుస్తకాలు ఉండేవని చారిత్రక ఆధారాలు చేబుతున్నాయి. ఈ విద్యాలయం గొప్పతనం తెలుసుకుని.. ఎందరో యాత్రికులు ఇక్కడకు వచ్చారు.
అలా 7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు జువాన్‌జాంగ్ నలందా విశ్వవిద్యాలయాన్ని సందర్శించాడు. కొన్నాళ్ల పాటు ఇక్కడ చదువుకుని.. సుమరు 657 గ్రంథాలను తీసుకుని తన దేశానికి తిరిగి వెళ్లాడు. అలానే ఈజింగ్ అనే మరో యాత్రికుడు నలంద విశ్వ విద్యాలయాన్ని సందర్శించి.. 400 గ్రంథాలను సేకరించాడు. ఈ చర్యలు తూర్పు ఆసియాలో బౌద్ధమత వ్యాప్తికి దోహదపడ్డాయి.
గుప్తుల కాలంలో ప్రారంభమైన నలందా విశ్వ విద్యాలయం.. హర్షవర్ధన, పాల సామ్రాజ్య రాజుల పోషణలో విశ్వ విఖ్యాతి గాంచింది. ఉచ్ఛ దశ నాటికి నలందలో సుమారు 10 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. వారి కోసం 2వేల మంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేవారు. ఆర్యభట్ట వంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు ఇక్కడ విద్య బోధించినట్లు చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకున్న నలందా విశ్వ విద్యాలయం.. తురుష్కుల కాలం నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నది.
క్రీ.శ. 1193లో తురుష్క ఆక్రమణదారుడైన బఖ్తియార్ ఖిల్జీ నలందా విశ్వ విద్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఇక్కడ ఉన్న గ్రంథాలయాన్ని కాలపెడితే.. అది సుమారు మూడు నెలల పాటు మండినట్లు చరిత్ర కారులు వెల్లడించారు. నలంద ధ్వంసం.. భారతదేశంలో బౌద్ధమతం క్షీణతకు ఒక కారణంగా చెప్పబడుతుంది.
నేటి ప్రభుత్వాలు.. నలందా పునరుజ్జీవనం కోసం చర్యలు తీసుకున్నాయి. దీనిలో భాగంగా నలందా పునరుజ్జీవనం కోసం భారత పార్లమెంటు 2010లో ఒక చట్టాన్ని ఆమోదించింది. అంతేకాక రాజ్‌గీర్‌లో కొత్త నలందా విశ్వవిద్యాలయం స్థాపించి.. 2014లో తిరిగి ప్రారంభించారు. ఈ కొత్త సంస్థను ‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ’గా గుర్తించారు. 2016లో నలందా శిథిలాలను యునెస్కో విశ్వ వారసత్వ స్థలంగా ప్రకటించింది. నలందా భారతదేశ విద్యా వైభవాన్ని, ఆసియా సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
ఈ చెప్పులకు లైఫ్‌టైం గ్యారెంటీ.. ఎలా తయారు చేశారో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఉగాది రోజు ఇవి తింటే మహా పాపం.. అవేంటంటే