Share News

Hotel: హోటల్‌కు వెళితే రహస్య కెమెరాల బెడద.. ఓ మహిళ ఆ సమస్యకు ఎలా చెక్ పెట్టిందంటే..

ABN , Publish Date - Feb 21 , 2025 | 08:10 PM

మహిళలు బట్టలు మార్చుకునేటపుడు, వాష్‌రూమ్‌ల్లోనూ స్పై కెమెరాలు పెట్టి చిత్రీకరించే దుర్మార్గుల గురించి వార్తలు రావడం చూస్తుంటాం. ముఖ్యంగా చైనాలో ఈ తరహా కేసులు ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ మహిళ వెరైటీ ప్లాన్ వేసింది.

Hotel: హోటల్‌కు వెళితే రహస్య కెమెరాల బెడద.. ఓ మహిళ ఆ సమస్యకు ఎలా చెక్ పెట్టిందంటే..
Hotel Room

సాధారణంగా మహిళలు షాపింగ్ మాల్స్, హోటల్ రూమ్స్‌కు వెళ్లినపుడు రహస్య కెమెరాలతో ఇబ్బందులు పడుతుంటారు. వాళ్లు బట్టలు మార్చుకునేటపుడు, వాష్‌రూమ్‌ల్లోనూ స్పై కెమెరాలు (Spy cameras) పెట్టి చిత్రీకరించే దుర్మార్గుల గురించి వార్తలు రావడం చూస్తుంటాం. ముఖ్యంగా చైనా (China)లో ఈ తరహా కేసులు ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ మహిళ వెరైటీ ప్లాన్ వేసింది. ఆమెను చాలా మంది ఫాలో కావడానికి సిద్ధపడుతున్నారు. (Viral News)


హోటల్ గదుల్లో గోప్యత, భద్రతకు ఓ మహిళ సృజనాత్మక పరిష్కారం కనుగొంది. హోటల్ గదిలో మంచం మీద తన భర్తతో కలిసి నిద్రపోయే సమయంలో ఎవరూ చిత్రీకరించకుండా ఉండేందుకు ఆమె తనతో ఓ టెంట్‌ను తీసుకెళ్తోంది. మంచం మీద ఆ టెంట్‌ను అమర్చి లోపలే బట్టలు మార్చుకోవడం, నిద్రపోవడం వంటి పనులు చేస్తోంది. గతేడాది చాలా చైనా జంటలకు సంబంధించిన హోటల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా మందిని ఆందోళనకు గురి చేసింది.


``హోటల్ అతిథులను రహస్య స్పై కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారని నేను చాలా వార్తలు చదివాను. రహస్య కళ్ల నుంచి మనల్ని మనం పూర్తిగా రక్షించుకోవడం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. అది నన్ను చాలా ఆందోళనకు గురిచేసింది. అందుకే మేం ఎక్కడకి వెళ్లినా మాతో పాటు టెంట్‌ను కూడా తీసుకెళ్తున్నాం`` అంటూ ఆ మహిళ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

Viral Video: అబ్బాయిని వదిలేస్తారు.. అమ్మాయిని మాత్రం కాపాడతారా? ఈ వీడియో చూస్తే..


Shocking: ఇదేందయ్యా ఇదీ.. ఎక్కడా చూడలేదే.. మేనేజర్ పెద్ద పాత్రలో కూర్చున్నాడేంటి? ఎందుకంటే..


Husband and wife: ఇలాంటి భార్య ఎక్కడైనా ఉంటుందా? భర్తకు ఇలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా?


Optical Illusion: జింక ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.. వేటగాడు ఎక్కడున్నాడో కనిపెట్టండి..


Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2025 | 08:10 PM