Share News

Budget 2025: అప్పుల భారం 8,06,298 కోట్లు

ABN , Publish Date - Mar 20 , 2025 | 05:39 AM

రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోంది. పాత అప్పులు, కొత్త బడ్జెట్‌లో తీసుకోబోయే అప్పులు కలిపి తడిసిమోపెడు కానున్నాయి. 2025-26లో తీసుకునే అప్పులతో కలిపి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రాష్ట్ర అప్పు రూ.5,04,814 కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది

Budget 2025: అప్పుల భారం  8,06,298 కోట్లు

ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రూ.5.04 లక్షల కోట్ల అప్పులు

  • కార్పొరేషన్ల పేరిట ఉన్న అప్పు 3.01 లక్షల కోట్లు

  • వీటికి 2025-26లో చెల్లించే వడ్డీలు, కిస్తీలు 39,396 కోట్లు

  • రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తిన 2,30,346 తలసరి అప్పు

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోంది. పాత అప్పులు, కొత్త బడ్జెట్‌లో తీసుకోబోయే అప్పులు కలిపి తడిసిమోపెడు కానున్నాయి. 2025-26లో తీసుకునే అప్పులతో కలిపి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రాష్ట్ర అప్పు రూ.5,04,814 కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో 28.1 శాతంగా ఉండనుంది. ఈ మొత్తం అప్పులో బహిరంగ మార్కెట్‌ రుణాలు రూ.4,07,059 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రుణాలు రూ.23,719 కోట్లు, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థల రుణాలు రూ.11,202 కోట్లు, స్మాల్‌ సేవింగ్స్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌కు సంబంధించి రూ.21,787 కోట్లు, డిపాజిట్లు, రిజర్వ్‌ ఫండ్‌ రూ.41,048 కోట్లుగా ఉన్నాయి. ఇవి కాకుండా ఎఫ్‌ఆర్‌బీఎంకు ఆవల కూడా కార్పొరేషన్ల పేరిట అప్పులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి కార్పొరేషన్ల అప్పులు మొత్తం రూ.3,01,484 కోట్లుగా ఉన్నాయని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది. ఇందులో కార్పొరేషన్ల కోసం ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చి, ప్రభుత్వమే స్వయంగా చెల్లించే అప్పులు రూ.1,17,109 కోట్లు కాగా, ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పొరేషన్లు తీసుకుని, కార్పొరేషన్లే చెల్లించే రుణాలు రూ.1,24,419 కోట్లు అని వివరించింది. ఇవే కాకుండా ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు రూ.59,956 కోట్లు అని పేర్కొంది. ఇలా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకున్న అప్పు రూ.5,04,814 కోట్లు, కార్పొరేషన్ల కోసం సేకరించిన అప్పు రూ.3,01,484 కోట్లు కలిపి మొత్తం అప్పు రూ.8,06,298 కోట్లుగా తేలుతోంది.


చెల్లించాల్సిన కిస్తీలు, వడ్డీలు..

ఇప్పటివరకు ఉన్న అప్పులకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలపై ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో వివరణ ఇచ్చింది. పాత అప్పుల అసలు, కొత్త అప్పుల వడ్డీల కింద ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.39,396.73 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇందులో కేవలం వడ్డీల కింద రూ.19,369.02 కోట్లు, కిస్తీల కింద రూ.20,027,71 కోట్లను చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ కిస్తీల్లో వేస్‌ అండ్‌ మీన్స్‌ కాకుండా ప్రభుత్వ రుణాలకు సంబంధించి రూ15,848.20 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రుణాలకు రూ.440.85 కోట్లు, ఇతర రుణాలకు సంబంధించి రూ.3,738.66 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు భారం పెరిగిపోతోంది. పాత అప్పు, తాజా బడ్జెట్‌లోని అప్పుతో కలిపితే ఒక్కొక్కరి నెత్తిన రూ.2,30,346 భారం ఉంటుందని అంచనా. రాష్ట్ర బడ్జెట్‌ అప్పు, బడ్జెట్‌కు ఆవల తీసుకున్న అప్పులు కలిపి మొత్తం రూ.8,06,298 కోట్లుగా ఉన్నట్లు తేలుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసిన ‘అట్లా్‌స’లో రాష్ట్ర జనాభా 3,50,03,674 ఉందని తెలిపింది. దీని ప్రకారం తలసరి అప్పు రూ.2,30,346 ఉండనుంది.

అప్పుల చిత్రమిదీ.

తీసుకున్న అప్పు చెల్లించిన రుణం మిగులు రుణాలు

2023-24 2024-25 2023-24 2024-25 2023-24 2024-25

మార్కెట్‌ రుణాలు 49,618 56,940 9,341 13,118 3,14,546 3,58,368

కేంద్రం నుంచి రుణాలు 1,948 2,500 325 398 18.057 20,159

ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ బాండ్ల ద్వారా 0 0 827 1,389 4,723 3,334

ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి 99,008 1,100 99,123 2,097 13,194 12,197

పీఎఫ్‌, బీమా ఫండ్స్‌ ద్వారా 3,468 3,181 1,568 2,226 16,862 17,816

రిజర్వ్‌ ఫండ్స్‌, డిపాజిట్ల ద్వారా 76,587 93,630 72,266 90,584 36,283 39,328

మొత్తం 2,30,629 1,57,351 1,83,451 1,09,812 4,03,664 4,51,203

Updated Date - Mar 20 , 2025 | 05:39 AM