Hyderabad: ఆస్తిలో వాటా ఇవ్వకపోతే చంపేస్తా !
ABN , Publish Date - Mar 20 , 2025 | 05:31 AM
భార్య వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాబాద్ లక్ష్మీనర్సింహనగర్‌లో బుధవారం జరిగింది.

భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య
బంజారాహిల్స్, మార్చి 19(ఆంధ్రజ్యోతి): భార్య వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాబాద్ లక్ష్మీనర్సింహనగర్‌లో బుధవారం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మహ్మద్ నవాజ్ సినీ పరిశ్రమలో కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. 2020లో శ్వేతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు కాపురం బాగానే సాగింది. అనంతరం శ్వేతారెడ్డి ఆస్తి కోసం నవాజ్‌ను వేధించడం మొదలు పెట్టింది. ప్రతి విషయంలోనూ గొడవ పడుతూ.. బాన్సువాడ, కరీంనగర్, బాలానగర్ పోలీసుస్టేషన్లలో భర్తపై కేసులు పెట్టింది. ఇదిలా ఉండగా, ఇద్దరూ కలిసి ఆరు నెలల క్రితం హైదరాబాద్‌లోని లక్ష్మీనర్సింహనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
ఇక్కడ కూడా పలుమార్లు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నెల 16న భార్య ఆస్తిలో వాటాతో పాటు రూ.30 లక్షలు ఇవ్వాలని వేధిస్తున్నదని నవాజ్ తన తల్లి సబేరా బేగంకు ఫోన్ చేసి చెప్పాడు. భోజనం పెట్టకుండా, నిద్రపోనివ్వకుండా వేధిస్తోందని వాపోయాడు. దీంతో నవాజ్ తల్లి.. శ్వేతారెడ్డికి ఫోన్ చేసి అడుడగా తనకు కావాల్సింది దక్కకపోతే కిరాయి మనుషులతో నవాజ్‌ను చంపిస్తానని బెదిరించింది. మరుసటి రోజు మరోసారి గొడవ జరగడంతో నవాజ్ తన తల్లికి ఫోన్ చేసి ఇదే తన చివరి ఫోన్ అని చెప్పాడు. కొద్ది సేపటికి అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సబేరా ఫిర్యాదు మేరకు శ్వేతారెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.