Share News

గాయాలతో సహవాసం

ABN , Publish Date - Jan 08 , 2025 | 05:37 AM

‘సిడ్నీ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌కు బుమ్రా దూరమయ్యాడని తెలిసి ఎంతగానో సంతోషించాం’.. 164 పరుగుల ఛేదనను విజయవంతంగా ముగించాక ఆసీస్‌ ఆటగాళ్లు ఖవాజా, హెడ్‌ చేసిన వ్యాఖ్యలివి. అప్పటికి రెండు రోజుల సమయం ఉండీ...

గాయాలతో సహవాసం

‘సిడ్నీ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌కు బుమ్రా దూరమయ్యాడని తెలిసి ఎంతగానో సంతోషించాం’.. 164 పరుగుల ఛేదనను విజయవంతంగా ముగించాక ఆసీస్‌ ఆటగాళ్లు ఖవాజా, హెడ్‌ చేసిన వ్యాఖ్యలివి. అప్పటికి రెండు రోజుల సమయం ఉండీ.. తక్కువ ఛేదనే అయినా బుమ్రా బుల్లెట్‌ బంతుల సంగతి తెలిసి వారు పడిన ఆందోళనకు తార్కాణమిది. కొన్నాళ్లుగా భారత క్రికెట్‌ అమ్ముల పొదిలో పేసర్‌ బుమ్రానే ప్రధాన ఆయుధం. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో అటు బ్యాటర్లు.. ఇటు ఇతర బౌలర్లు విఫలమైనా ఒక్కడై కంగారూల భరతం పట్టాడు. మిగతా భారత పేసర్లు 40 వికెట్లు తీస్తే.. తనొక్కడే 32 వికెట్లతో వహ్వా అనిపించాడు. మొత్తంగా సిరీ్‌సలో 908 బంతులు వేశాడు. కానీ ఈ అధిక ఒత్తిడే మరోసారి బుమ్రాను గాయపడేలా చేసింది. ఆఖరి టెస్టు మధ్యలోనే వెన్నునొప్పి తిరగబెట్టడంతో బరిలోకి దిగలేకపోయాడు. ప్రస్తుతం అతడి గాయం పరిస్థితిపై బోర్డు నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. కానీ రాబోయే ఇంగ్లండ్‌ సిరీ్‌సలతో పాటు చాంపియన్స్‌ ట్రోఫీకి అందుబాటులో ఉండేది కూడా సందేహమేనని చెబుతున్నారు.


కెరీర్‌ ఆరంభం నుంచే గాయాలు నీడలా వెంటాడుతున్నా, పట్టుదలతో కోలుకుని జట్టులోకి రావడం బుమ్రాకు అలవాటుగా మారింది. 2018లో భారత జట్టు మూడు నెలలపాటు ఐర్లాండ్‌-ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది. కానీ తొలి టీ20లోనే బుమ్రా ఎడమ చేతి బొటనవేలికి ఫ్రాక్చర్‌ అయ్యింది. దీంతో మొదటిసారి అతడు గాయంతో మూడు వారాలపాటు జట్టుకు దూరమయ్యాడు. మరుసటి ఏడాది విండీస్‌ టూర్‌లో వెన్నునొప్పి బాధపెట్టడంతో ఈసారి మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో స్వదేశంలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో సిరీ్‌సలకు దూరమయ్యాడు. ఇక 2021 జనవరి సిడ్నీ టెస్టులో ఉదర కండరాలు పట్టేయడంతో కోలుకునేం దుకు నెలరోజులు పట్టింది. 2022 ఆగస్టులో బుమ్రా మరోసారి వెన్నునొప్పికి గురయ్యాడు. ఈసారి జట్టుకు గట్టి దెబ్బే పడిం ది. ఆసియాక్‌పతో పాటు ఆసీ్‌సలో జరిగిన టీ20 వరల్డ్‌క్‌పనకు సైతం అందుబాటులో లేకుండాపోయాడు. 2023, మార్చిలో బుమ్రా సర్జరీ చేయించుకోవడంతో ఆ ఏడాది ఐపీఎల్‌, వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌తో పాటు చాలా టోర్నీలను ఆడలేకపోయాడు. ఇలా కీలక టోర్నీల్లో తను లేకపోవడం జట్టు విజయావకాశాలపైనా ప్రభావం చూపింది.


దాదాపు ఏడాది విరామం తర్వాత 2023 ఆగస్టులో ఐర్లాండ్‌తో టీ20 సిరీ్‌సకు కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. అలాగే ఆసియాక్‌పతో పాటు భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌క్‌పలోనూ అదరగొట్టాడు. ఇక అప్పట్నుంచి బీసీసీఐ కూడా అతడిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ వచ్చింది. కానీ ఇటీవలి ఆసీస్‌ టూర్‌లో అందరూ భయపడినట్టుగానే బుమ్రాను మరోసారి గాయం పలుకరించింది. కీలక చాంపియన్స్‌ ట్రోఫీ ముంగిట జట్టుకిది గట్టి షాక్‌ అని అనుకోవచ్చు. అటు బుమ్రా కోలుకునేందుకు ఈసారి ఎన్ని రోజులు పడుతుందనేది జట్టుతో పాటు అభిమానులను కలవరపరుస్తోంది.

2018 నుంచే.. అతడిపైనే

భారమెందుకు?

బుమ్రాపై అధిక భారం పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. దేశంలో వర్ధమాన బౌలర్లకు కొదవ లేదని, వారంతా జట్టులో చాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పాడు. వారికి అవకాశాలు కల్పిస్తే బుమ్రాపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉంటుందని సూచించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడనిస్తేనే యువ బౌలర్ల ప్రతిభ తెలుస్తుందని తెలిపాడు.


ఐసీసీ అవార్డుకు బుమ్రా నామినేట్‌

బుమ్రా డిసెంబరుకు సంబంధించి ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ పురస్కారానికి నామినేట్‌ అయ్యాడు. ఇటీవలి ఆసీస్‌ టూర్‌లో అతను విశేషంగా రాణించిన సంగతి తెలిసిందే. బుమ్రాతో పాటు ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌, దక్షిణాఫ్రికా సీమర్‌ ప్యాటర్సన్‌ అవార్డు రేసులో ఉన్నారు.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Updated Date - Jan 08 , 2025 | 05:37 AM