Share News

Azmatullah Omarzai 103m Six: పట్టపగలే ఆసీస్‌కు చుక్కలు.. ఈ సిక్స్ చూశాక నిద్రపట్టడం కష్టమే

ABN , Publish Date - Feb 28 , 2025 | 07:18 PM

AFG vs AUS: ఆస్ట్రేలియాతో ఆడుకున్నాడో 24 ఏళ్ల బ్యాటర్. సిక్సులు కొట్టడమే ధ్యేయంగా ఆడుతూ కంగారూలను వణికించాడు. అతడు కొట్టే షాట్లు చూసి సొంత జట్టు అభిమానులు కూడా ఇదేం హిట్టింగ్ అంటూ గుడ్లు తేలేశారు.

Azmatullah Omarzai 103m Six: పట్టపగలే ఆసీస్‌కు చుక్కలు.. ఈ సిక్స్ చూశాక నిద్రపట్టడం కష్టమే
AFG vs AUS

చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు చేరాలంటే కీలకంగా మారిన మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్ అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా ఆ టీమ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. టాపార్డర్ విఫలమైనా సెదీఖుల్లా అటల్ (85)తో పాటు ఆఖర్లో ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయి (67) దుమ్మురేపారు. సెదీఖుల్లా పట్టుదలతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేశాడు. ఒమర్జాయి మాత్రం సిక్సులతో రెచ్చిపోయాడు. స్పెన్సర్ జాన్సన్, బెన్ డ్వార్షూస్, నాథన్ ఎల్లిస్‌తో కూడిన కంగారూ పేస్ అటాక్‌పై విరుచుకుపడ్డాడు. ఏకంగా 5 సిక్సులతో వాళ్లను ఊచకోత కోశాడు. అందులో ఒక సిక్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.


కొడితే గ్యాలరీలోకే..

నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అంపైర్ తల మీదుగా అద్భుతమైన సిక్స్ కొట్టాడు ఒమర్జాయి. బంతి వేగానికి తన భుజ బలాన్ని జోడించి బంతిని స్టేడియంలోకి తరలించాడు. పర్ఫెక్ట్ టైమింగ్ కూడా తోడవడంతో బంతి ఏకంగా 103 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఆ తర్వాత జాన్సన్ బౌలింగ్‌లో మళ్లీ నిలబడిన చోటు నుంచి సిక్స్ బాదాడు ఒమర్జాయి. ఈసారి షార్ట్ డెలివరీని గ్యాలరీల్లో కూర్చున్న ఆడియెన్స్ దగ్గరకు పంపాడు. ఆసీస్ బౌలర్లను బచ్చా టీమ్ బౌలర్లుగా చేసుకొని ఒమర్జాయి కొట్టిన కొట్టుడు, భారీ దూరం వెళ్లి బంతులు పడటం చూస్తే ఆసీస్ ఫ్యాన్స్‌కు ఇవాళ నిద్ర పట్టడం కష్టమే. మ్యాచ్ గెలిచినా ఒమర్జాయి ఉతుకుడు మాత్రం వాళ్లను వేధించడం ఖాయమని నెటిజన్స్ అంటున్నారు.


ఇవీ చదవండి:

ఆసీస్‌ను ఊచకోత కోసిన 24 ఏళ్ల బ్యాటర్..

ఒకడేమో దారుణశస్త్రం.. ఒకడేమో మారణశాస్త్రం..

ఆసీస్‌ను భయపెట్టిన ఆఫ్ఘాన్ బ్యాటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 07:23 PM