Rohit-Virat: పగతో రగిలిపోతున్న రోహిత్.. కోహ్లీ కోసమైనా గెలవాలి
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:01 PM
Rohit Sharma: భారత్-పాకిస్థాన్ సంకుల సమరానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ చిరకాల ప్రత్యర్థి జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. దీంతో క్రికెట్ లవర్స్ ఫోకస్ అంతా ఈ మ్యాచ్ మీదే నెలకొంది.

రోహిత్-విరాట్.. టీమిండియాకు మూలస్తంభాలైన ఈ స్టార్స్ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు చూశారు. ప్రతి ఫార్మాట్‌లోనూ టీమ్‌ను టాప్‌లో నిలిపారు. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లతో భారత్‌ను మోస్ట్ డేంజరస్ టీమ్‌గా మార్చేశారు. మన జట్టును చూస్తే ప్రత్యర్థులు భయపడి పోసుకునే స్థితికి తీసుకెళ్లారు. టీ20 వరల్డ్ కప్-2024 రూపంలో మెగా కప్పును కూడా ఒడిసిపట్టారు. అయినా వీళ్ల కెరీర్‌లో కొన్ని ఓటములు ఎప్పటికీ మర్చిపోలేనివిగా ఉన్నాయి. గెలుపోటములు రోకో జోడీకి కొత్తేం కాదు. కానీ కొన్ని పరాజయాలు మాత్రం పంటి కింద రాయిలా గుచ్చుకుంటూనే ఉన్నాయి. అందులో ప్రధానమైనవి చాంపియన్స్ ట్రోఫీలోనే జరిగాయి. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మీదే కావడం గమనార్హం.
మర్చిపోలేని ఓటమి!
రోహిత్-కోహ్లీ కెరీర్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఎన్నో మ్యాచుల్లో విజయం సాధించింది. ఫార్మాట్ ఏదైనా దాయాదిపై మనదే పైచేయి. ఐసీసీ టోర్నీల్లో ఆ టీమ్ మన చేతిలో ఎన్నోసార్లు చిత్తయింది. అయితే చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఇరు టీమ్స్ ఐదుసార్లు తలపడగా.. ఇందులో పాక్‌దే పైచేయి అయింది. భారత్ రెండుసార్లు నెగ్గగా.. మూడు సార్లు దాయాది గెలిచింది. అందునా 2017లో రోహిత్-కోహ్లీ కెరీర్ పీక్‌లో ఉన్న టైమ్‌లో మన టీమ్ ఓటమిపాలైంది. ఆ టోర్నీ ఫైనల్ మనకో పీడకల. గ్రూప్ దశలో పాక్‌ను చిత్తుగా ఓడించిన కోహ్లీ సేన.. తుదిపోరులో అదే టీమ్ చేతుల్లో ఏకంగా 181 రన్స్ తేడాతో పరాజయం పాలై కప్పు చేజార్చుకుంది. అప్పటి జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీతో పాటు ఓపెనింగ్ చేసిన రోహిత్ ఇప్పుడు మళ్లీ చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌తో తలపడుతున్నారు.
ఎండ్‌కార్డ్ పడాల్సిందే!
కోహ్లీ సారథ్యంలో ఆ రోజు గెలిచి ఉంటే భారత్ ఒడిలో మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరేది. ఆ పరాభం విరాట్‌ను ఎంతో కుంగదీసింది. ఆ ఫైనల్‌లో రోహిత్ డకౌట్ అయ్యాడు. విరాట్ 5 పరుగులే చేసి నిరాశపర్చాడు. అప్పటి టీమ్‌లోని రవీంద్ర జడేజా 15 రన్స్ చేయగా.. హార్దిక్ పాండ్యా ఒక్కడే 76 పరుగులతో ఫైట్ చేశాడు. ఆ ఓటమిని ఆటగాళ్లే కాదు.. అభిమానులూ మర్చిపోలేదు. 8 ఏళ్లుగా ఉన్న ఆ తీరని పగకు సండే ఫైట్‌తో ఎండ్‌కార్డ్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అప్పట్లో కప్పు గెలవలేకపోయిన మాజీ సారథి కోహ్లీ కోసమైనా ఈసారి పాక్‌తో పాటు ఇతర టీమ్స్ మీదా గెలిచి ట్రోఫీని సొంతం చేసుకోవాలని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
ఇండో-పాక్ మ్యాచ్.. ఐఐటీ బాబా ప్రిడిక్షన్ వైరల్
భారత్‌తో మ్యాచ్.. పాక్‌కు గట్టి షాక్
మొనగాడి ఎంట్రీ.. పాక్‌కు ఇక కాళరాత్రే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి