Share News

Gold Silver Rates Today: వావ్ మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ షాకిచ్చిన వెండి

ABN , Publish Date - Apr 08 , 2025 | 06:42 AM

దేశంలో పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఎందుకంటే బంగారం ధరలు నిన్నటితో పోల్చితే మళ్లి తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ ధరలు ఏ మేరకు తగ్గాయి. ఇతర నగరాల్లో ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Silver Rates Today: వావ్ మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ షాకిచ్చిన వెండి
gold and silver rate today

బంగారం ప్రియులకు మంచి వార్త వచ్చేసింది. ఎందుకంటే, బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఏప్రిల్ 8, 2025న ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 90,370కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 82,840గా ఉంది. ఇది గత రేట్లతో పోలిస్తే 280 రూపాయలు తగ్గింది.

ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 90,520కు చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ. 82,990కి చేరుకుంది. ఈ ధరలు కూడా గత రేట్లతో పోలిస్తే మార్పు చెందాయి. ఇదిలా ఉండగా, వెండి ధరలు భారీగా పెరిగాయి. 1 కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 102,900కి చేరుకుంది, ఇది నిన్నటి రేటు కంటే 9,000 రూపాయలు పెరగడం విశేషం.


దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధలు ఎలా ఉన్నాయంటే (24, 22 క్యారెట్)

  • జైపూర్‎లో రూ.90,520, రూ.82,990

  • ముంబైలో రూ.90,370, రూ.82,840

  • కోల్‌కతాలో రూ.90,370, రూ.82,840

  • అహ్మదాబాద్‎లో రూ.90,420, రూ.82,890

  • చెన్నైలో రూ.90,370, రూ.82,840

  • బెంగళూరులో రూ.90,370, రూ.82,840

  • న్యూఢిల్లీలో రూ.90,520, రూ.82,990

  • విశాఖపట్నంలో రూ.90,370, రూ.82,840

  • లక్నోలో రూ.90,520, రూ.82,990

  • కేరళలో రూ.90,370, రూ.82,840


ధరల మార్పులను

బంగారం, వెండి ధరలు మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ ధరల మార్పులు పెట్టుబడిదారులపై ప్రభావం చూపిస్తాయి. పసిడి లేదా బంగారం కొనుగోలు చేయాలా లేదా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోవాలంటే, మార్కెట్ పరిస్థితులు, ధరల మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, బంగారం శుద్ధత కూడా ధరపై ప్రభావం చూపిస్తుంది. బంగారం శుద్ధతను కొలిచే ముఖ్యమైన పద్ధతి "క్యారెట్" వ్యవస్థ. 24 క్యారెట్ బంగారం అంటే 100% శుద్ధత కలిగిన బంగారం. అయితే, సర్వసాధారణంగా వినియోగంలో ఉన్న బంగారం 22 క్యారెట్, 18 క్యారెట్ లేదా 14 క్యారెట్ రూపంలో ఉంటాయి. ప్రతి క్యారెట్ బంగారం శుద్ధత కింద ప్రత్యేకంగా ఉంటాయి.

  • 24 క్యారెట్: 100% శుద్ధత

  • 22 క్యారెట్: 91.7% శుద్ధత

  • 18 క్యారెట్: 75% శుద్ధత

  • 14 క్యారెట్: 58.3% శుద్ధత

ఇది, బంగారం కొనుగోలు చేయాలనుకునే వ్యక్తుల కోసం, శుద్ధత ఆధారంగా ధర నిర్ణయాలను అవగాహన చేసుకోవడంలో సహాయపడుతుంది.


ఇవి కూడా చదవండి:


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

YouTube: యూట్యూబ్ నుంచి క్రేజీ ఫీచర్..ఇకపై షార్ట్స్ క్రియేషన్స్ మరింత ఈజీ

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 08 , 2025 | 06:54 AM