IPL 2025 Points Table: ఇంట్రెస్టింగ్‌గా ఐపీఎల్ పాయింట్స్ టేబుల్.. డేంజర్‌లో టాప్ టీమ్
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:07 PM
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఒకదాన్ని మించి మరో మ్యాచ్ సాగుతూ.. ఉత్కంఠతో ఆడియెన్స్‌ను కట్టిపడేస్తోంది. ఈ నేపథ్యంలో అప్‌డేటెడ్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ తాజా సీజన్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఒకట్రెండు మ్యాచులు స్లోగా సాగినా.. దాదాపుగా ఎక్కువ మ్యాచులు చివరి ఓవర్ వరకు వెళ్తున్నాయి. ప్రేక్షకులను ఉత్కంఠకు లోను చేస్తున్నాయి. సీట్ల ఎడ్జ్ మీద నిల్చోబెట్టి మ్యాచ్ చూసేలా చేస్తున్నారు ఆటగాళ్లు. ముఖ్యంగా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో బ్యాటర్లు మస్తు వినోదాన్ని పంచుతున్నారు. ఇప్పటికే ప్రతి టీమ్ కనీసం ఒక మ్యాచ్ ఆడింది. కొన్ని జట్లు రెండేసి మ్యాచులు కూడా ఆడాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది.. ఏ టీమ్ డేంజర్‌లో ఉందనేది ఇప్పుడు చూద్దాం..
టాప్‌లో ఆరెంజ్ ఆర్మీ
కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆడిన ఒక మ్యాచ్‌లో గెలిచిన కమిన్స్ సేన.. 2 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. నెట్ రన్‌రేట్ ప్లస్ 2.200గా ఉంది. రెండో స్థానంలో ఆర్సీబీ ఉంది. ఆ టీమ్ ఖాతాలోనూ 2 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్‌రేట్ +2.137గా ఉంది. పంజాబ్, సీఎస్‌కే, డీసీ, కేకేఆర్ వరుసగా 3, 4, 5, 6 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా బోణీ కొట్టని లక్నో, ముంబై, గుజరాత్ వరుసగా 7, 8, 9 ప్లేస్‌లో నిలిచాయి. ఆరంభ సీజన్‌లో కప్పు కొట్టిన చాంపియన్ టీమ్ రాజస్థాన్.. ఊహించని విధంగా టేబుల్‌లో చివరి స్థానానికి పరిమితమైంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడటం వల్లే ఆ టీమ్ వెనుకంజలో ఉంది.
ఇవీ చదవండి:
24 గంటల్లో మూడుసార్లు 97 నాటౌట్
రోహిత్, కోహ్లీ ఆ గ్రేడ్‌లో ఉంటారా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి