Shubman Gill: ఆ భయం ఇంకా వెంటాడుతోంది.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 26 , 2025 | 05:30 PM
Shubman Gill On His Form: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మునుపటిలా ఆడటం లేదు. యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడుతూనే అవసరమైనప్పుడు హిట్టింగ్ చేయడం గిల్ శైలి. అలాంటోడు ఇప్పుడు బ్యాట్ ఊపాలంటే భయపడుతున్నాడు.

శుబ్‌మన్ గిల్.. టీమిండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అతడే అన్నారు. కోహ్లీ వారసుడు అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. ఇంత తక్కువ వయసులో ఇంత మెచ్యూరిటీ గ్రేట్ అంటూ ప్రశంసించారు. దీంతో గిల్‌కు మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ప్లేయర్‌గా అవకాశం ఇచ్చింది బీసీసీఐ. పరుగుల వరద పారించడంతో వైస్ కెప్టెన్‌గానూ ప్రమోషన్ ఇచ్చింది. అతడికి తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. వరుస వైఫల్యాలు. టెస్టుల్లో భారత్ వరుస ఓటములకు కీలక కారణాల్లో అతడి ఫెయిల్యూర్ కూడా ఒకటి. తదుపరి కెప్టెన్ అంటూ ప్రశంసలు అందుకున్న ఆటగాడు.. ఇప్పుడు జట్టులో చోటు కోసం పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అనవసర టెన్షన్!
ఫామ్ కోల్పోవడం, అన్ని వైపుల నుంచి విమర్శలు గుప్పుమనడంతో గిల్ దేశవాళీ బాట పట్టాడు. ఫామ్, ఫిట్‌నెస్, టెక్నిక్‌ను మెరుగుపర్చుకునేందుకు రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఈ క్రమంలో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ తరఫున ఆడి సెంచరీ కూడా బాదేశాడు. పంజాబ్ ఓడినా అతడి సెంచరీ, బ్యాటింగ్ చేసిన తీరును అంతా మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో తన ఫామ్ విషయంలో ఇంకా భయం పోలేదన్నాడు. అనవసరంగా ఒత్తిడి పెంచుకొని ఇబ్బంది పడుతున్నానని ఒప్పుకున్నాడు.
అదే రీజన్!
‘లాంగ్ ఫార్మాట్‌లో నా బ్యాటింగ్ నన్ను భయపెడుతోంది. ఫామ్ నన్ను టెన్షన్ పెడుతోంది. కొన్నిసార్లు మంచి స్టార్ట్స్ అందుకున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయా. 25 నుంచి 30 పరుగులు చేస్తున్నా.. భారీ సెంచరీలుగా మలచడంలో తడబడుతున్నా. నా మీద నేనే అనవసరంగా ప్రెజర్ పెంచుకుంటున్నట్లు అనిపిస్తోంది. నా పెర్ఫార్మెన్స్ తగ్గడానికి అదే రీజన్. ఏకాగ్రతను కోల్పోతే ఇలాంటి ఇబ్బందులే వస్తాయని అర్థమైంది. అందుకే మున్ముందు ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వకుండా ప్లాన్ ప్రకారం రెడీ అవుతా’ అని గిల్ చెప్పుకొచ్చాడు. ఇక మీదట సమయం దొరికినప్పుడల్లా దేశవాళీల్లో పాల్గొంటానని తెలిపాడు. అయితే ఇంటర్నేషనల్ సిరీస్‌కు, డొమెస్టిక్ మ్యాచులకు మధ్య కనీసం 2 నుంచి 3 వారాల టైమ్ ఉంటేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. రెస్ట్ తీసుకోవడం కూడా ఓ ఆటగాడిగా తనకు చాలా ముఖ్యమని వివరించాడు.
ఇదీ చదవండి:
కోహ్లీకి అదిరిపోయే ఆఫర్.. ఫ్యాన్స్ కోసమైనా మిస్ అవ్వొద్దు
మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్.. వర్తు వర్మ వర్తు
టీమిండియాకు కొత్త కోహ్లీ.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి