CSK vs RCB Live: దయాల్ బీభత్సం.. మరో రెండు సీఎస్కే వికెట్లు డౌన్
ABN , Publish Date - Mar 28 , 2025 | 10:49 PM
సీఎస్కేకు కీలకమైన రచిన్ రవీంద్ర వికెట్‌ను దయాల్ పడగొట్టాడు. ఆ తరువాత దూబే వికెట్ కూడా తీసుకోవడంతో ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయిన సీఎస్కే కష్టాల్లో కూరుకుపోయింది.

ఇంటర్నెట్ డెస్క్: సీఎస్కే భారీ ఇబ్బందుల్లో కురుకుపోయింది. దయాల్ బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో ఓటమి దిశగా ప్రయాణం మొదలెట్టినట్టైంది. చెన్నైకి అండగా ఉంటాడనుకున్న రచిన్ రవీంద్రను యశ్ దయాల్ 13వ ఓవర్‌లో క్లీన్ బైల్డ్ చేశాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ప్యాడ్స్‌ను తాకి వికెట్లను పడగొట్టడంతో సీఎస్కే కీలక ప్లేయర్‌ను కోల్పోయింది.
ఆ తరువాత యశ్ దయాల్ శివమ్ దూబేను కూడా పెవిలియన్‌కు పంపించాడు. శివమ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో కావడంతో ఆర్సీబీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఓవర్‌లో కేవలం ఆరు పరుగులే ఎస్కేకు దక్కాయి. దీంతో, 13 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే స్కోరు కేవలం 81 పరుగులకే పరిమితమైంది. దీంతో, చెన్నై అభిమానులు ఆవేదన పతాకస్థాయికి చేరుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి