Share News

IPL 2025, CSK: పరిస్థితులు మారతాయి.. సీఎస్కే పరిస్థితిపై జడేజా ఆసక్తికర పోస్ట్

ABN , Publish Date - Apr 01 , 2025 | 05:05 PM

చెన్నై జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించిన చెన్నై ఆ తర్వాత ఓటమి బాట పట్టింది. హోమ్ గ్రౌండ్‌లో ఆర్సీబీ చేతిలోనూ, గువాహటిలో రాజస్తాన్ చేతిలోనూ ఓటమి పాలై విమర్శలు ఎదుర్కొంటోంది.

IPL 2025, CSK: పరిస్థితులు మారతాయి.. సీఎస్కే పరిస్థితిపై జడేజా ఆసక్తికర పోస్ట్
Ravindra jadeja with Dhoni

ఐదుసార్లు ఐపీఎల్ (IPL 2025) ట్రోఫీలను అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఈ సీజన్‌లో మాత్రం తడబడుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతోంది. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించిన చెన్నై ఆ తర్వాత ఓటమి బాట పట్టింది. హోమ్ గ్రౌండ్‌లో ఆర్సీబీ చేతిలోనూ, గువాహటిలో రాజస్తాన్ చేతిలోనూ ఓటమి పాలై విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటు ఆటగాళ్లతో పాటు, అటు సీఎస్కే అభిమానులు (CSK Fans) కూడా డీలా పడ్డారు.


సీఎస్కే అభిమానులను ఉత్సాహపరిచేందుకు ఆ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ‌లో ఓ పోస్ట్ పెట్టాడు. తను, ధోనీ కలిపి ఆడుతున్న ఫొటోను షేర్ చేసి.. పరిస్థితులు మారుతాయి అంటూ జోష్ నింపే ప్రయత్నం చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి ఒక విజయం, రెండు పరాజయాలు ఎదుర్కొన్న సీఎస్కే తన తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్ 5వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో తలపడబోతోంది.


ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడో స్థానంలో ఉంది. తర్వాతి మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని చెన్నై కృతనిశ్చయంతో ఉంది. కాగా, ఇప్పటివరకు చెన్నై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసింది. తొలి మ్యాచ్‌లో గెలిచి తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తర్వాతి మ్యాచ్ స్వంత మైదానం అయిన చెన్నైలో జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని చెన్నై టీమ్ ప్రణాళికలు రచిస్తోంది.

ఇవి కూడా చదవండి..

Riyan Parag: రియాన్ పరాగ్‌కు అంత పొగరా.. అతడిపై నిషేధం విధించాలంటూ నెటిజన్ల కామెంట్లు


చార్జీకు డబ్బుల్లేవ్.. కట్ చేస్తే ఐపీఎల్ హీరో

కోహ్లీ టార్గెట్ తెలిస్తే మైండ్‌బ్లాంక్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 05:05 PM