Riyan Parag: రియాన్ పరాగ్‌కు అంత పొగరా.. అతడిపై నిషేధం విధించాలంటూ నెటిజన్ల కామెంట్లు
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:45 PM
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. రియాన్ పరాగ్ సారథ్యంలో రాజస్తాన్ ఈ సీజన్‌లో తొలి విజయం సాధించింది. విజయం అనంతరం జరిగిన ఓ ఘటనలో రియాన్ పరాగ్ ప్రవర్తన చాలా మందికి కోపం తెప్పించింది.

యువ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag)పై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై వెంటనే నిషేధం విధించాలని డిమాండ్లు చేస్తున్నారు. దానికి అభిమానులతో అతడు వ్యవహరించిన తీరే కారణం. ఐపీఎల్ (IPL 2025)లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (RR vs CSK)ను 6 పరుగుల తేడాతో ఓడించింది. రియాన్ పరాగ్ సారథ్యంలో రాజస్తాన్ ఈ సీజన్‌లో తొలి విజయం సాధించింది.
రాజస్తాన్ రాయల్స్ విజయం అనంతరం జరిగిన ఓ ఘటనలో రియాన్ పరాగ్ ప్రవర్తన చాలా మందికి కోపం తెప్పించింది. మ్యాచ్ అనంతరం గువాహటి గ్రౌండ్ సిబ్బంది లోకల్ హీరో అయిన రియాన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడ్డారు. వారితో రియాన్ పరాగ్ సెల్ఫీ తీసుకున్నాడు. అయితే అనంతరం ఆ ఫోన్‌ను చేతికి సక్రమంగా ఇవ్వకుండా, వారి మీదకు విసిరేశాడు. ఓ వ్యక్తి క్యాచ్ పట్టుకోవడంతో ఆ మొబైల్ కింద పడలేదు. అభిమానుల ముంద అంత ఆటిట్యూడ్‌ను ప్రదర్శించడం నెటిజన్లకు నచ్చలేదు.
ఆ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ రియాన్ పరాగ్‌ను విమర్శిస్తున్నారు. కెరీర్ ఆరంభంలోనే రియాన్‌కు ఇంత పొగరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అతడిపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా రియాన్ పరాగ్ ఇలా నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.
ఇవీ చదవండి:
లక్నోతో పంజాబ్ ఢీ.. ప్రిడిక్షన్ ఇదే..
చార్జీకు డబ్బుల్లేవ్.. కట్ చేస్తే ఐపీఎల్ హీరో
కోహ్లీ టార్గెట్ తెలిస్తే మైండ్‌బ్లాంక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం చదవండి