CSK vs RCB Live: కోహ్లీ ఔట్.. ఆర్సీబీకి మరో షాక్
ABN , Publish Date - Mar 28 , 2025 | 08:42 PM
ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో కింగ్ కోహ్లీ జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. 12వ ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్‌లో కింగ్ కోహ్లీ జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి నుంచి తడబడ్డ కోహ్లీ ఆ తరువాత కాస్త తేరుకున్నట్టు అనిపించినా భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. నూర్ బౌలింగ్‌లో మిడాన్ షాట్ ఆడబోయి జడేజాకు క్యాచ్ ఇచ్చుకున్నాడు. 31 పరుగులకు ఔటయ్యాడు.
మ్యాచ్ ప్రారంభమైన నాటి నుంచీ కోహ్లీ నెమ్మదిగా ఆడటం ప్రారంభించాడు. మరోవైపు సాల్ట్ పరుగుల వరద పారించాడు. దీంతో, ఆర్బీబీ స్కోరు వేగంగా పెరిగింది. ఆ తరువాత సాల్ట్ వికెట్ కోల్పోవడంతో ఆర్సీబీ నెమ్మదించింది. అయితే, ప్రతి ఓవర్లో దాదాపు ఒకటో రెండో బౌండరీలు రావడంతో ఆర్బీసీ రన్ రేట్ ఓ మోస్తరు స్థాయిలో కొనసాగింది.
ఇక పతిరన బౌలింగ్‌లో బంతి తన హెల్మెట్ పైన తాకడంతో కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి మరీ హైట్‌కు వెళ్లడంతో వైడ్‌గా ప్రకటించాలని అంపైర్ డిమాండ్ చేశారు. కానీ అంపైర్ పతిరనకు వార్నింగ్‌తో సరిపెట్టాడు. ఆ తరువాత కోహ్లీ తన బ్యాట్ ఝళిపించాడు. రెండో బంతికి సిక్స్, మూడో బంతికి ఫోర్ బాది తన తడాఖా చూపించాడు. దీంతో, ఆ ఓవర్లో ఆర్సీబీకి ఏకంగా 16 పరుగులు దక్కాయి. మరోవైపు, ఈ ఓవర్‌లో రజత్‌కు మూడు సార్లు లైఫ్ లభించింది. ప్రత్యర్థులు వరుసగా క్యాచ్‌లు జారవిడచడంతో రజత్ కు లైఫ్ దక్కింది. అయితే, దూకుడు మొదలెట్టిన కోహ్లీ మరో భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. నూర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి 31 పరుగులకే వెనుదిరిగాడు. కోహ్లీ పరుగుల వరద పారిస్తాడనుకున్న తరుణంలో వికెట్ కోల్పోవడం అభిమానులకు నిరాశ మిగిల్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి