Virat Kohli: ఐపీఎల్ ట్రోఫీ కాదు.. కోహ్లీ నెక్స్ట్ టార్గెట్ తెలిస్తే మైండ్‌బ్లాంక్
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:07 PM
IPL 2025: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ ఇప్పుడు పీక్‌లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఐసీసీ ట్రోఫీలు కొల్లగొట్టిన కింగ్.. ఈసారి ఐపీఎల్ కప్పుపై కన్నేశాడు. అయితే దీని కంటే అతడికి మరో బిగ్ టార్గెట్ ఉందట. అదేంటో ఇప్పుడు చూద్దాం..

భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేదు కింగ్. దీంతో ఆర్సీబీని విజేతగా నిలబెట్టాలని అతడు పంతంతో ఉన్నాడు. ఏడాది గ్యాప్‌లో టీ20 వరల్డ్ కప్-2024తో పాటు వన్డే ఫార్మాట్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ ఇండియా టీమ్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు విరాట్. దీంతో ఐపీఎల్ మీదే అతడి ఫోకస్ ఉందని అంతా అనుకున్నారు. కానీ తన లక్ష్యం మరొకటి అని అతడు అంటున్నాడు. మరి.. అదేంటో ఇప్పుడు చూద్దాం..
బిగ్ ప్లాన్ రెడీ
వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ కప్ గెలవడమే తన టార్గెట్ అని రివీల్ చేశాడు కోహ్లీ. 2027లో జరగబోయే ప్రపంచ కప్ మీద ఫోకస్ చేస్తున్నట్లు అతడు తెలిపాడు. ఐపీఎల్ మ్యాచులతో బిజీగా ఉన్న కింగ్.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీ తదుపరి లక్ష్యం ఏంటి.. అసలేం చేయబోతున్నారు.. పెద్దగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా.. అని అడిగిన ప్రశ్నకు విరాట్ స్పందించాడు. 2027 వరల్డ్ కప్‌ను గెలుచుకోవాలని భావిస్తున్నానని అతడు తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్.. కింగ్ ఇప్పట్లో రిటైర్ అవ్వడని, టీమిండియాకు మరో ఐసీసీ ట్రోఫీ అందించాకే అతడికి విశ్రాంతి అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఆడిన 2 మ్యాచుల్లో నెగ్గిన ఆర్సీబీ.. 4 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో ఫస్ట్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతోంది.
ఇదీ చదవండి:
రోహిత్ సిక్స్‌కు దద్దరిల్లిన స్టేడియం
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం చదవండి