CSK IPL 2025: రైనా కావాలంటున్న సీఎస్‌కే.. ఇంతకంటే అవమానం లేదు
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:32 PM
IPL 2025: చాంపియన్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచుల్లో రెండింట్లో ఓడిన ధోని టీమ్.. స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వాలని అనుకుంటోంది.

క్రికెట్ అంటే ఒక్కరు ఆడే ఆట కాదు. జట్టులోని 11 మంది కలసికట్టుగా రాణిస్తేనే జట్టుకు విజయాలు సాధ్యం. ఒక్కో ప్లేయర్‌కు ఒక్కో రకమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అయితే టీమ్ భారాన్ని మోసే కొందరు క్రికెటర్లు ఉంటారు. వాళ్లు లేకపోతే టీమ్ బ్యాలెన్స్ దెబ్బతినడమే కాదు.. గెలుపోటములు కూడా డిసైడ్ అవుతాయి. అలాంటి ఓ ఆటగాడి లోటు ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. సురేష్ రైనా. ఈ వెటరన్ బ్యాటర్ లేకపోవడంతో సీఎస్‌కే పరిస్థితి దారుణంగా తయారైంది.
ఉఫ్‌మని ఊదేసేవాడు
ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్‌లో గెలుపొందిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా 2 మ్యాచుల్లో ఓటమి పాలైంది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో 7వ స్థానానికి పడిపోయింది. ఇంకొన్ని పరాజయాలు వస్తే ఆ టీమ్‌కు ప్లేఆఫ్స్ ఆశలు మరింత సన్నగిల్లుతాయి. అయితే దీనంతటికీ కారణం మిడిలార్డర్‌లో సురేష్ రైనా లాంటి తోపు బ్యాటర్ లేకపోవడమే. రైనా టీమ్‌లో ఉంటే ఎంత భారీ స్కోరు అయినా ఛేజ్ చేయగలనే ధీమాతో ఉండేది చెన్నై. 200 ప్లస్ టార్గెట్ ఉన్నా ధోని టీమ్ భయపడేది కాదు. దీనికి రికార్డులే సాక్ష్యం.
బయటపడిన వీక్‌నెస్
రైనా టీమ్‌లో ఉన్నప్పుడు 180 ప్లస్ స్కోర్లను ఛేజ్ చేస్తూ 9 మ్యాచుల్లో గెలుపొందింది చెన్నై సూపర్ కింగ్స్. అదే అతడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేశాక.. ఒక్కసారి కూడా అంత స్కోరును ఛేదించలేకపోయింది. టార్గెట్ 170 దాటితే సీఎస్‌కే బ్యాటర్లు భయపడుతున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తప్పితే ఎవ్వరూ రాణించడం లేదు. రైనా మాదిరి ఫినిషర్లు లేకపోవడంతో ఛేజింగ్‌లో చేతులెత్తేస్తోంది సీఎస్‌కే. ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్‌పై 182 రన్స్ ఛేజ్ చేయబోయి 176 రన్స్ వద్ద ఆగిపోయింది. అంతకుముందు ఆర్సీబీ మీద 196 ఛేదించబోయి 146 పరుగులకే పరిమితమైంది సీఎస్‌కే.
రీఎంట్రీ ఇస్తాడా..
చెన్నై ఛేజింగ్ వీక్‌నెస్ బయటపడటంతో టాస్ గెలిచిన అపోజిషన్ టీమ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగుతున్నాయి. గట్టి టార్గెట్ సెట్ చేసి సీఎస్‌కేకు ఇస్తున్నాయి. అది ఛేజ్ చేయలేక చెన్నై చతికిలపడుతోంది. దీంతో సీఎస్‌కేలోకి రైనా మళ్లీ రావాలని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ధోని ఆడగా లేనిది.. అతడి కంటే 5 ఏళ్లు చిన్నవాడైన రైనా రీఎంట్రీ ఇస్తే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. అయితే రిటైరైన ప్లేయర్‌ను మళ్లీ తీసుకురావడం ఏంటి.. దీని కంటే దారుణం ఏదీ ఉండదని మరికొందరు నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. కామెంట్రీతో రైనా బిజీగా ఉన్న టైమ్‌లో ఇలాంటి రూమర్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో అతడు ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఇదీ చదవండి:
రోహిత్ సిక్స్‌కు దద్దరిల్లిన స్టేడియం
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం చదవండి