Dharmendra: సీనియర్ నటుడికి ఐ సర్జరీ.. ఐయామ్ స్ట్రాంగ్ అంటూ ఫ్యాన్స్‌కి అభివాదం
ABN , Publish Date - Apr 01 , 2025 | 02:47 PM
89 ఏళ్ల వయస్సులోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ ప్రతిరోజూ తన అనుభవాలను, సంతోషాన్ని ఆయన షేర్ చేస్తుంటారు. మంగళవారంనాడు ముంబై ఆసుపత్రి వెలుపల కుడికంటికి బ్యాండేజ్‌తో ఆయన కనిపించారు.

ముంబై: బాలీవుడ్ హీ-మ్యాన్‌గా పేరున్న వెటరన్ సూపర్‌స్టార్ ధర్మేంద్ర (Dharmendra) ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉన్నారు. 89 ఏళ్ల వయస్సులోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ ప్రతిరోజూ తన అనుభవాలను, సంతోషాన్ని షేర్ చేస్తుంటారు. మంగళవారంనాడు ఆయన ముంబై ఆసుపత్రి వెలుపల కుడికంటికి బ్యాండేజ్‌తో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తమ ఫేవరెట్ స్టార్ ఆరోగ్యం గురించి నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
Gas Cylinders: గ్యాస్ వాడకం దారులకు గుడ్ న్యూస్
అసలు విషయం ఏమిటంటే.. ధర్మేంద్ర కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ధర్మేంద్ర అంటేనే ధైర్యం అనే మాటను ఆయన మరోసారి రుజువు చేసుకుంటూ ''ఇప్పటికీ నాలో చాలా ఎనర్జీ ఉంది'' అంటూ చేతులు ఊపుతూ ధర్మేంద్ర తన ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు. ఇంకా ఎంతో జీవితం ఉందని, కంటికి శస్త్రచికిత్స అయిందని చెప్పారు. అభిమానుల ప్రేమను ఎప్పటికీ మరచిపోలేనని, తాను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని వివరించారు. తన కంటికి సంబంధించిన వివరాలను ఆయన పెద్దగా చెప్పనప్పటికీ ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సామాజిక మాధ్యమ్యాల్లో వరుస పోస్టుల్లో కోరుకుంటున్నారు.
కాగా, ధర్మేంద్ర ఇప్పటికీ తన నట జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కీర్తిసనన్, షాహిద్ కపూర్ తాజా చిత్రం ''తేరే బాతో మే ఐసా ఉల్జా జియా''లో కనిపించారు. రణ్‌వీర్ సింగ్, అలియా భట్ ''రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ కహానీ'' చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాల్లోనూ బలమైన పాత్రలనే ఆయన పోషించారు. ధర్మేంద్ర తదుపరి చిత్రంపై ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేనప్పటికీ ప్రతిరోజూ ఆయన సామాజిక మాధ్యమాల్లో కొత్త పోస్టులతో తన అభిమానులను పలకరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఘోర ప్రమాదం.. మంటల్లో కాలి 12 మంది మృతి
మొగలుల పాలనా అంశాల్ని పాఠ్య పుస్తకాల నుంచి ఎందుకు తొలగించారు : సోనియా గాంధీ
For National News And Telugu News