CSK vs RCB: సీఎస్కేకు భారీ షాక్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
ABN , Publish Date - Mar 28 , 2025 | 09:52 PM
చెపాక్ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కేకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.

ఇంటర్నెట్ డెస్క్: చెపాక్ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కేకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఆర్సీబీ ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన సీఎస్కేకు హెజల్‌వుడ్ వరుస షాకులిచ్చాడు. రెండో ఓవర్‌లో ఏకంగా రెండు కీలక వికెట్లు తీసుకుని సీఎస్కే నడ్డి విరిచాడు. తొలి ఓవర్‌లో సీఎస్కేకు కేవలం 7 పరుగులే దక్కాయి. ఆ తరువాత వచ్చి హేజల్‌వుడ్ రెండవ బంతికి త్రిపాఠీ బలయ్యాడు. బౌన్స అయిన బంతి అతడి బ్యాట్‌కు తగిలి చేరుగా సాల్ట్ చేతిలోకి వెళ్లడంతో త్రిపాఠీ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.
అదే ఓవర్ చివరి బంతికి ఆర్సీబీ కెప్టెన్ రుతురాజ్ షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. బౌండరీ వద్ద బండాగేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో, కేవలం 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సీఎస్కే చిక్కుల్లో పడింది. హిట్టర్లు వెనుదిరగడంతో అభిమానల్లో టెన్షన్ మొదలైంది. తదుపరి ప్లేయర్లు గట్టి భాగస్వామ్యాలు నెలకొల్పి స్కోరును పరిగెత్తించని పక్షంలో సీఎస్కే మరిన్ని చిక్కుల్లో పడటం పక్కా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి