IPL 2025 CSK vs RCB Live: బ్యాటింగ్‌కు దిగాల్సి రావడంపై ఆర్బీసీ కెప్టెన్ ఏమన్నాడంటే..
ABN , Publish Date - Mar 28 , 2025 | 07:36 PM
తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. తాము బౌలింగ్ ఎంచుకుని ఉండేవాళ్లమని ఆర్సీబీ కెప్టెన్ కూడా ఉన్నారు. మంచి స్కోర్ చేసి ఒత్తిడి పెంచుతామని చెప్పాడు.

క్రీడాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంరంభం మొదలైంది. చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈసారి మరింత మెరుగ్గా ఆడతాని అన్నారు. ‘‘ఈ సారి మొదట బౌలింగ్ చేయదలిచాము. గతంలో కంటే ఈసారి మరింత మెరుగ్గా ఆడతాము. ఇప్పటివరకూ తేమ అయితే లేదు. కానీ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అది మా చేతుల్లో లేదు. ఈసారి మరింత దూకుడుగా ఉంటాము. బ్యాటింగ్‌లో మరింత కచ్చితంగా ఉంటాము’’ అని చెప్పుకొచ్చాడు.
తాము టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకుని ఉండేవాళ్లమని ఆర్సీబీ కెప్టెన్ పటీదార్ అన్నాడు. అయితే, ఎవరు ముందు బ్యాటింగ్ చేశారనేది పెద్ద ప్రభావం చూపించదని అభిప్రాయపడ్డాడు. పిచ్ ఉపరితలం హార్డ్‌గా కనిపిస్తోంది. మంచి స్కోరు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తాము. గత గేమ్‌లో మా వాళ్లు బాగా ఆడారు. ఈ రోజు కూడా ఇదే విధంగా ఉంటారు’’ అని రజత్ పటిదార్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి