Kitchen Hacks: మీరు కొంటున్న కందిపప్పు నిజమైనదా లేదా నకిలీదా.. తెలుసుకునేందుకు కొన్ని చిట్కాలు..
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:20 PM
How to check purity of toor dal: సౌత్ ఇండియాలో ప్రతిరోజూ పప్పు లేదా సాంబార్ చేసేవారు ఎంతోమంది. వీటి తయారీ కోసం కందిపప్పు వాడతారనే సంగతి తెలిసిందే. అందరూ అధికంగా వినియోగించే కందిపప్పును మార్కెట్లో కొనుగోలు చేసేటప్పుడు మంచిదో..కాదో.. తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇటీవల మార్కెట్లో కల్తీ సరకులు విక్రయించే వారి సంఖ్య పెరుగుతోంది మరి..

How to check purity of toor dal: ఇటీవలి రోజుల్లో ఆహార కల్తీ పెరిగిపోతోంది. మార్కెట్లో దొరికే చాలా సరకుల్లో నకిలీవే ఉంటున్నాయి. పప్పు,రసం లేదా సాంబార్ తయారీ కోసం వాడే కందిపప్పును ఈ మధ్య విచ్చలవిడిగా కల్తీ చేస్తూ విక్రయిస్తున్నారు. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల చాలామంది తమరోజువారీ ఆహారంలో కందిపప్పుతో వండిన వంటకాలు తప్పనిసరిగా తింటుంటారు. మీరు గనక పొరపాటున మార్కెట్లో అసలైన కందిపప్పుకు బదులు కల్తీ చేసినదాన్ని కొనుక్కుంటే ఆరోగ్య ప్రయోజనాలు రాకపోగా వైకల్యం, క్యాన్సర్ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి మీరు మార్కెట్లో కొన్న కందిపప్పు నిజమైనదా లేదా నకిలీదా అని ఇలా గుర్తించండి.
నకిలీ పప్పును గుర్తించేందుకు కొన్ని చిట్కాలు :
అసలైన కందిపప్పు పరిమాణంలో చిన్నగా, లేత పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉంటుంది. సైజులో పెద్దగా ఉన్నవైతే హైబ్రిడ్ పప్పు. వీటిలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. పై రెండింటిలా దట్టమైన పసుపు రంగుతో మెరిసిపోతూ కనిపిస్తే అది రంగుపూసినవని తెలుసుకోండి.
మార్కెట్లో కందిపప్పు కొనే ముందు వాటిని చేతిలోకి తీసుకుని గట్టిగా రుద్దండి. ఒకవేళ అది కల్తీది అయితే పప్పు గోధుమ రంగులోకి మారుతుంది.
సాధారణంగా కందిపప్పుకు ఘాటైన వాసన ఉండదు. తేలికపాటి సహజ వాసతోనే ఉంటుంది. అలా కాకుండా కెమికల్స్ వాసన కొట్టొచ్చినట్టుగా అనిపిస్తే కొనకండి.
పప్పు నిజమైనదో కాదో తెలుసుకోవడానికి ఇలా కూడా చేయవచ్చు. వీటని గోరువెచ్చని నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టి చూడండి. నీరు పసుపు రంగులోకి మారితే ఈ పప్పు కల్తీ చేశారని అర్థం చేసుకోండి.
పప్పు స్వచ్ఛతను పరీక్షించడానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ పప్పును నీటిలో వేసి రెండు చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపండి. ఈ సమయంలో పప్పు వేరే రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం.
నకిలీ పప్పు చౌక ధరకు లభిస్తుంది. ఇలా తక్కువ ధరకు లభించేవి నాణ్యత లేని పప్పుధాన్యాలని గుర్తుంచుకోండి.
కందిపప్పు ఆకృతి గుండ్రంగా ఉంటుంది. అలా కాకుండా విరిగిపోయి ఉన్నవి ఎక్కువగా కనిపిస్తే అవి మంచివి కావు.
అసలైన కందిపప్పు సాధారణంగా 20-30 నిమిషాల్లో ఉడికిపోతుంది. నకిలీవి అరగంట దాటినా ఉడకవని తెలుసుకోండి.
నమ్మకస్తులైన వ్యక్తులు లేదా FSSAI సర్టిఫికేషన్ ప్యాక్ ఉన్న బ్రాండెడ్ సరకులనే కొనుగోలు చేయండి.
Read Also: Heat relief solutions: సమ్మర్‌లో శరీర వేడి తగ్గేందుకు కొన్ని చిట్కాలు..
Relationship Tips:మీ భార్యను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా.. అద్భుతమైన టిప్స్ మీకోసం..
Sabja Seeds: సబ్జా గింజలు రోజుకు ఎన్ని తింటున్నారు.. ఇంతకు మించి తీసుకుంటే..