IPL 2025 CSK vs RCB: రజత్ ఔట్.. ఆర్సీబీకి భారీ దెబ్బ
ABN , Publish Date - Mar 28 , 2025 | 09:11 PM
ఆర్సీబీకి చివరి ఓవర్‌లో మరో భారీ షాక్ తగిలింది. 19వ ఓవర్‌లో మ్యాచ్ కీలక దశలో ఉన్న సమయంలో రజత్ ఔటయ్యాడు.

ఆర్సీబీకి మరో భారీ షాక్ తగిలింది. 19వ ఓవర్‌లో మ్యాచ్ కీలక దశలో ఉన్న సమయంలో రజత్ ఔటయ్యాడు. అర్ధ శతకం చేసి స్పీడు మీదున్న రజత్ పతిరనా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. సామ్ కరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, కోహ్లీ తడబడుతున్న తరుణంలో రజత్ అర్ధ సెంచరీ ఆర్సీబీకి కీలకంగా మారింది. 30 బంతుల్లో అర్ధశతకం సాధించి ఆర్సీబీకి వెన్నుదన్నుగా నిలిచాడు.
తొలి నుంచీ దూకుడు కోసం ప్రయత్నించిన రజత్ పటీదార్ 4 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. అటు సాల్ట్, ఇటు రజత్ ఓ మోస్తరు దూకుడు ప్రదర్శించడంతో ఆర్సీబీకి పరుగుల వరద కొనసాగుతోంది. మరోవైపు, 18 ఓవర్ ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. స్కోరు 200 దాటాలని అభిమానులు వేడుకుంటున్నారు. కాగా, 19వ ఆర్సీబీకి చిక్కులు మిగుల్చింది. పతిరనా బౌలింగ్ లో అటు రజత్ ఇటు కృనాల్ అవుట్ కావడంతో ఆర్సీబీ అభిమానుల్లో ఆందోళన రేకెత్తుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి