హరి గెలుపు..అర్జున్ ఓటమి
ABN , Publish Date - Jan 22 , 2025 | 02:20 AM
టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ విభాగంలో తెలుగు గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, పెంటేల హరికృష్ణకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అర్జున్ ఓడగా....

వికాన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ విభాగంలో తెలుగు గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, పెంటేల హరికృష్ణకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అర్జున్ ఓడగా.. హరికృష్ణ రెండో విజయా న్ని నమోదు చేశాడు. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్‌లో అర్జున్‌పై వ్లాదిమిర్ ఫెడోసా (స్లోవేనియా) గెలిచాడు. వార్‌మెర్డమ్ (నెదర్లాండ్స్)తో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరి.. 23 ఎత్తుల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించాడు. సహచరుడు లియాన్ మెడోన్కాపై ప్రజ్ఞానంద గెలిచాడు. చాలెంజర్స్ విభాగంలో నోడెర్‌బెర్ యాకుబ్‌బొయేవ్ (ఉజ్బెకిస్థాన్)పై వైశాలి నెగ్గింది.