Share News

IPL 2025: ఈసారి ఐపీఎల్ ప్రారంభోత్సవానికి టాప్ హీరోయిన్లతోపాటు..

ABN , Publish Date - Mar 19 , 2025 | 06:08 PM

2025 ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడింది. వచ్చే ఆదివారం మొదలు కానున్న నేపథ్యంలో అభిమానులు సైతం ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఈ వేడుక ప్రారంభానికి పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు రానున్నట్లు ఖరారైంది.

IPL 2025: ఈసారి ఐపీఎల్ ప్రారంభోత్సవానికి టాప్ హీరోయిన్లతోపాటు..
IPL 2025

దేశంలో క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)2025 సీజన్ రానే వచ్చేసింది. ఈ 18వ సీజన్‌ మార్చి 22న కోల్‎కతా వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రారంభ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలతో కూడిన పలువురు ప్రముఖులు కూడా వచ్చి ప్రేక్షకుల్ని అలరించనున్నారు. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ నటీనటులు హాజరుకానున్నారు.


ఎవరెవరు వస్తున్నారంటే..

ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ప్రత్యేకంగా ప్రదర్శన ఇవ్వనుంది. దీంతో పాటు ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ కూడా తన పాటలతో ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆమె స్వరాలతో ఐపీఎల్ ప్రారంభ వేడుకను మరింత మధురంగా మార్చనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే నటీనటుల జాబితా కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిలో సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, కత్రినా కైఫ్, త్రిప్తి దిమ్రి, అనన్య పాండే, మాధురి దీక్షిత్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖులు ఉంటారని తెలుస్తోంది.


ఈసారి డబుల్ డోస్

ఈ సారి ఐపీఎల్ 2025 సీజన్‌లో క్రికెట్ ప్రియులకు ఎంటర్టైన్మెంట్ అంతకుమించి ఉంటుందని చెబుతున్నారు. క్రికెట్ ప్రేమికులకు సెలబ్రిటీ కార్యక్రమాలు, కొత్త వేదికలు, ప్రత్యేక మెగా షోలు, ఇలా అన్ని కలసి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయని అంటున్నారు. BCCI తన ప్రతిష్టను పెంచడానికి, మ్యాచ్‌ల మధ్యలో మల్టీడీమన్షనల్ ప్రదర్శనలు కూడా వేయాలని యోచిస్తోంది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌ అభిమానులకు మరింత జోష్‎ను అందించనుంది.


అంతరాయం లేకుండా కార్యక్రమాలు

ఈ విధమైన భారీ స్థాయి ప్రారంభ వేడుకలు నిర్వహించడంలో కొన్ని సాంకేతిక సవాళ్లు రావచ్చు. కానీ, ఈసారి బీసీసీఐ, రాష్ట్ర సంఘాలు కలిసి ప్రతి కార్యక్రమాన్ని సజావుగా సాగించేలా చూసుకుంటున్నారు. ఈ వేడుకలలో ప్రతిభ కనబరచేందుకు, ముగ్గురు సెలబ్రిటీలను ఒకే వేదికపై ఉంచాలని భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Credit Card: ఓర్నీ..క్రెడిట్ కార్డ్ వద్దని బ్లాక్ చేసినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా..

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Credit Score: మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినా..సిబిల్ స్కోర్ తగ్గుతుందా, ఇలా చేయండి

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 19 , 2025 | 06:09 PM