నాయకుడే ఆడకపోతే ఎలా..?
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:22 AM
రోహిత్ శర్మ పేలవ ఫామ్ జట్టును తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ అతడు ఆడిన 10 ఇన్నింగ్స్‌లో ఒక్కదాంట్లో కూడా పట్టుమని 15 పరుగులు చేయలేదు. ఈ నేపథ్యంలో...

న్యూఢిల్లీ: రోహిత్ శర్మ పేలవ ఫామ్ జట్టును తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ అతడు ఆడిన 10 ఇన్నింగ్స్‌లో ఒక్కదాంట్లో కూడా పట్టుమని 15 పరుగులు చేయలేదు. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ను ఉద్దేశించి దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ ఫామ్‌లో లేకపోతే జట్టు కూడా సమస్యలు ఎదుర్కొంటుందన్నాడు. ‘రోహిత్ గొప్ప ఆటగాడు. త్వరగా ఫామ్ అందుకొంటాడని ఆశిస్తున్నా. ఇటీవలి కాలంలో మనోళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. కానీ, అప్పుడప్పుడూ జట్టులో అస్థిరత కనిపిస్తోంది. కెప్టెన్ పేలవ ఫామ్‌లో ఉంటే.. ఆ ప్రభావం జట్టుపై పడుతుంది. జట్టు కుదురుకోవడానికి సమయం పడుతుంది. అయితే, చాంపియన్స్ ట్రోఫీ సమయానికి అంతా సిద్ధమైపోవాలి. దేశమంతా టీమిండియా ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది’ అని కపిల్ ఓ యూట్యూబ్ చానెల్‌తో చెప్పాడు.
ఇవీ చదవండి:
క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..
ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి
‘సన్‌రైజర్స్’బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్ విధానం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి