రెండో ర్యాంక్‌కు మంధాన
ABN , Publish Date - Jan 22 , 2025 | 02:38 AM
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో ర్యాంక్‌కు చేరుకుంది...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో ర్యాంక్‌కు చేరుకుంది. మంగళవారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి టాప్-10లో మంధానకు మాత్రమే చోటు దక్కింది. వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా) టాప్‌లో ఉండగా, చమరి ఆటపట్టు (శ్రీలంక) తృతీయ స్థానం దక్కించుకుంది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ నాలుగో స్థానానికి చేరగా, 1, 2 స్థానాల్లో ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్), గార్డ్‌నర్ (ఆస్ర్టేలియా) ఉన్నారు.