Share News

MS Dhoni: నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా.. సీఎస్కే వాళ్లు లాక్కెళ్తారు: ఎంఎస్ ధోనీ

ABN , Publish Date - Mar 23 , 2025 | 02:50 PM

43 ఏళ్ల వయసులో కూడా సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నిజానికి 2013లో ధోనీ తీవ్రమైన మోకాలు నొప్పితో బాధపడ్డాడు. ఆ ఏడాదిలోనే మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. 2024 ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సిక్స్‌లతో హోరెత్తించాడు.

MS Dhoni: నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా.. సీఎస్కే వాళ్లు లాక్కెళ్తారు: ఎంఎస్ ధోనీ
MS Dhoni

అంతర్జాతీయ క్రికెట్ నుంచి కొన్నేళ్ల క్రితమే వైదొలిగిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్‌లో (IPL 2025) మాత్రం ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. 43 ఏళ్ల వయసులో కూడా సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నిజానికి 2023లో ధోనీ తీవ్రమైన మోకాలు నొప్పితో బాధపడ్డాడు. ఆ ఏడాదిలోనే మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. 2024 ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సిక్స్‌లతో హోరెత్తించాడు. అయితే మ్యాచ్ మొత్తం మైదానంలో ఉండలేకపోయాడు (Dhoni Retirement).


ఈ ఏడాది కూడా సీఎస్కే తరఫున ధోనీ బరిలోకి దిగుతున్నాడు. ఈసారి ఫిట్‌గానే ఉన్న ధోనీ మ్యాచ్ మొత్తం ఆడేలా కనబడుతున్నాడు. అయితే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని, దీని తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తాడని చాలా మంది భావిస్తున్నారు. ఆ వార్తలకు ధోనీ తనదైన శైలిలో చెక్ పెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్.. ఇది నా ఫ్రాంఛైజీ. సీఎస్కే తరఫున మరికొంత కాలం ఆడాలనుకుంటున్నా. ఒకవేళ నేను వీల్‌చైర్‌లో ఉన్నా సరే.. లాక్కెళ్లిపోతారు అని ధోనీ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. ధోనీ రిటైర్మెంట్ వ్యాఖ్యలను చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ కూడా ఖండించాడు.


తాజా సీజన్‌లో ధోనీ ఎప్పటిలాగానే కీపింగ్ బాధ్యతలు చేపడతాడని అందరూ భావిస్తున్నారు. గతంలోలా ఎనిమిదో స్థానంలో కాకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందుగానే వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడుతోంది.

ఇవి కూడా చదవండి..

IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే


IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 02:50 PM