భర్తపై బాక్సర్ స్వీటీ ‘పంచ్’లు!
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:22 AM
వరల్డ్ చాంపియన్ బాక్సర్ స్వీటీ బూరా..తన భర్త, కబడ్డీ ఆటగాడు దీపక్ హుడాపై పోలీస్ స్టేషన్ సాక్షిగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీపక్ హుడా...

హిసార్ (హరియాణా): వరల్డ్ చాంపియన్ బాక్సర్ స్వీటీ బూరా..తన భర్త, కబడ్డీ ఆటగాడు దీపక్ హుడాపై పోలీస్ స్టేషన్ సాక్షిగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీపక్ హుడా తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, దౌర్జన్యం కూడా చేస్తున్నాడని ఆరోపిస్తూ స్వీటీ విడాకుల కోసం దాఖలు చేసింది. అంతేకాదు..భర్తపై హిసార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి తన వివరణ ఇచ్చేందుకు దీపక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సందర్భంగా..భర్తపై స్వీటీ దాడి చేసినట్టు తెలుస్తోంది. స్టేషన్‌లో రెండు కుటుంబాల సమక్షంలోనే.. ఒక్కసారిగా భర్త హుడాపైకి దూసుకెళ్లిన స్వీటీ అతడి గొంతు పట్టుకొని పిడి గుద్దులు కురిపించడం వీడియోలో కనిపించింది. దాంతో ఇరు కుటుంబాల సభ్యులు జోక్యం చేసుకొని స్వీటీని విడదీయాల్సి వచ్చింది. ‘పోలీసులు నన్ను ప్రశ్నిస్తున్న సమయంలోనే స్వీటీ, ఆమె తండ్రి నన్ను దుర్భాషలాడారు. నాకు రెండు చోట్ల గాయాలయ్యాయి’ అని దీపక్ తెలిపాడు. కాగా, భర్త నుంచి భరణాన్ని ఆశించడం లేదనీ, తనకు విడాకులు ఇస్తే చాలంటూ స్వీటీ ఓ వీడియో విడుదలజేసింది.
ఇవి కూడా చదవండి..
Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక
Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..